Shashi Tharoor : శ‌శి థ‌రూర్ కు ట్ర‌బుల్ షూట‌ర్ ఫోన్

కేంద్ర మంత్రి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు

Shashi Tharoor : శ‌శి థ‌రూర్ మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ కాంగ్రెస్ అగ్ర నేత‌. అంతే కాదు సోష‌ల్ మీడియాను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. ఏ అంశంపైన నైనా ఆయ‌న‌కు వెన్న‌తో పెట్టిన విద్య‌.

ప‌లు అంశాల‌పై మంచి ప‌ట్టుంది శ‌శి థ‌రూర్ కు. ఇవాళ ఆయ‌న పుట్టిన రోజు. దేశ వ్యాప్తంగా ఆయ‌న‌కు పార్టీ ప‌రంగానే కాదు ఇత‌ర పార్టీల‌కు చెందిన వారు కూడా అభిమానులు ఉన్నారు.

వ‌య‌సు పెరిగినా తను మాత్రం నిత్యం య‌వ్వ‌నుడిగా ఉంటారు. ఈ త‌రుణంలో ప్ర‌తి ఒక్క‌రు గ్రీటింగ్స్ తెలియ చేస్తూ వ‌చ్చారు. సామాజిక వేదిక‌ల ద్వారా. కానీ ఉన్న‌ట్టుండి శ‌శి థ‌రూర్ కు ఫోన్ వ‌చ్చింది.

ఆ ఫోన్ చేసింది ఎవ‌ర‌య్యా అంటే భార‌తీయ జ‌న‌తా పార్టీకి క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ‌గా మారిన , ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరొందిన , కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా నుంచి.

ఈ విష‌యాన్ని శ‌శి థ‌రూర్ స్వ‌యంగా త‌న అధికారిక ట్విట్ట‌ర్ లో వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. సామాన్యంగా షా ఎవ‌రికీ ఫోన్ చేయ‌డు.

కానీ ప్ర‌తిప‌క్ష పార్టీకి చెందిన శ‌శి థ‌రూర్ కు చేయ‌డం ఆస‌క్తిని క‌లిగించింది. అయితే శ‌శి థ‌రూర్ (Shashi Tharoor)అంద‌రితో క‌లివిడిగా ఉంటారు. ఇదే ఆయ‌న‌కు పెద్ద అడ్వాంటేజ్ గా మారింది.

ఆంగ్ల భాష‌పై మంచి ప‌ట్టు క‌లిగిన ఈ లీడ‌ర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. త‌న పుట్టిన రోజును జ్ఞాప‌కం పెట్టుకుని అమిత్ షా ఫోన్ చేయ‌డం త‌న‌ను ఎంత‌గానో సంతోషానికి గురి చేసింద‌ని పేర్కొన్నారు శ‌శి థ‌రూర్.

ఆత్మీయంగా మాట్లాడినందుకు ఆనందంగా ఉంద‌న్నాడు.

Also Read : ఒక‌వేళ సీఎం నైనా సామాన్యుడినే

Leave A Reply

Your Email Id will not be published!