INDW vs ENGW : చెత్త‌గా ఆడారు చేతులెత్తేశారు

భార‌త్ పై ఇంగ్లండ్ విక్ట‌రీ

INDW vs ENGW  : విండీస్ తో దుమ్ము రేపిన భార‌త జ‌ట్టు ఉన్న‌ట్టుండి మ‌రోసారి ఇంగ్లండ్ INDW vs ENGW )చేతిలో చేతులెత్తేసింది. ఐసీసీ మహిళ‌ల వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ -2022లో భాగంగా న్యూజిలాండ్ లోని మౌంట్ మౌంగ‌నూయి లోని బే ఓవ‌ల్ లో జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఝుల‌న్ గోస్వామి అద్భుత‌మైన బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న చేసిన‌ప్ప‌టికీ ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు కెప్టెన్ హీథ‌ర్ నైట్ అద్భుతంగా ఆడింది. హాఫ్ సెంచ‌రీ చేసి స‌త్తా చాటింది. టార్గెట్ చిన్న‌దైన‌ప్ప‌టికీ ర‌న్స్ చేయ‌డంలో ఇంగ్లండ్ తడ‌బ‌డింది.

విజ‌యం కోసం 135 ప‌రుగుల ల‌క్ష్యంగా బ‌రిలోకి దిగిన ఇంగ్లండ్ గ్రాండ్ విక్ట‌రీని(INDW vs ENGW )న‌మోదు చేసింది. ఓపెన‌ర్లు టామీ బ్యూమాంట్ , డానియెల్ వ్యాట్ ఒక ప‌రుగుకే వెనుదిరిగారు. న‌లాలీ స్కివ‌ర్ , అమీ జోన్స్ సైతం ఆక‌ట్టుకోలేక పోయారు.

భార‌త బౌల‌ర్ల‌లో మేఘనా సింగ్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టింది. అంత‌కు ముందు బ్యాటింగ్ చేసిన భార‌త జ‌ట్టు 36.2 ఓవ‌ర్ల‌లో 134 ప‌రుగుల‌కే ఆలౌటైంది.

ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో స్పిన్న‌ర్ షార్లెట్ డీన్ 4 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా పేస‌ర్ అన్యాష్రుబ్సోల్ 2 వికెట్లు తీసింది. సోఫీ ఎక్లెస్టోన్ , కేట్ క్ర‌సా్ చెరో వికెట్ తీశారు. ఇక ఇండియా టీమ్ త‌ర‌పున స్మృతి మంధాన‌, రిచా ఘోష్ ..ఝుల‌న్ గోస్వామి మాత్ర‌మే గ‌ట్టి పోటీ ఇచ్చారు.

మంధాన 35 ప‌రుగులు చేసింది. ఇక వ‌ర‌ల్డ్ క‌ప్ లో నాలుగు మ్యాచ్ లు ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన భార‌త జ‌ట్టు రెండు మ్యాచ్ ల‌లో గెలుపొందింది.

మ‌రో రెండు మ్యాచ్ ల‌లో ఓట‌మి పాలైంది. ఇండియా పాకిస్తాన్, విండీస్ పై నెగ్గితే న్యూజిలాండ్, ఇంగ్లండ్ తో ఓట‌మి పాలైంది.

Also Read : భార‌త్ విజ‌యం సీరీస్ కైవ‌సం

Leave A Reply

Your Email Id will not be published!