Shatrughan Sinha : నేను స‌రే మ‌రి మోదీ మాటేంటి

శ‌త్రుఘ్న సిన్హా సంచ‌ల‌న కామెంట్స్

Shatrughan Sinha : ప్ర‌ముఖ న‌టుడు, టీఎంసీ (TMC Leader) నాయ‌కుడు శ‌త్రుఘ్న సిన్హా (Shatrughan Sinha)సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌న‌పై చేసిన ఆరోప‌ణ‌ల‌ను తిప్పి కొట్టారు. తాను బ‌య‌టి వ్యక్తినంటూ చేసిన వ్యాఖ్య‌ల‌కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు.

నేను బ‌య‌టి వ్య‌క్తినైతే మ‌రి ప్ర‌ధాన మంత్రి వార‌ణాసి నుంచి పోటీ చేశారు క‌దా మ‌రి ఆయ‌న స్థానికుడా అని ప్ర‌శ్నించారు. ఎన్నిక‌ల కంటే ముందు (Trinamool Congress Party) తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

శ‌త్రుఘ్న సిన్హాకు సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ అస‌న్ సోల్ లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నికకు సంబంధించి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించింది. ఇవాళ ఆయ‌న పార్టీ త‌ర‌పున నామినేష‌న్ దాఖ‌లు చేశారు.

అంత‌కు ముందు (BJP) ఎంపీగా ఉన్న ప్ర‌ముఖ గాయ‌కుడు బాబుల్ సుప్రియో త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. కేంద్ర మంత్రికి గుడ్ బై చెప్పేశారు. ఆయ‌న కూడా టీఎంసీలో చేరారు.

ప్ర‌స్తుతం అసెంబ్లీ ఉప ఎన్నిక‌లో సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ టికెట్ కేటాయించారు. అస‌న్సోల్ ప్ర‌జ‌లు త‌న‌పై న‌మ్మ‌కం ఉంచార‌ని, వారి ఆద‌రాభిమానాలు త‌న‌ను త‌ప్ప‌క గెలిపిస్తాయ‌ని ధీమా వ్య‌క్తం చేశారు శ‌త్రుఘ్న సిన్హా(Shatrughan Sinha).

(BJP) త‌న‌ను బ‌య‌టి నుంచి వ‌చ్చిన వ్య‌క్తిగా పేర్కొన‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ఒక‌రిపై రాళ్లు వేసే ముందు మీ పార్టీలో ఉన్న నేత‌ల గురించి ఆలోచించాల‌ని పేర్కొన్నారు.

ఇవాళ ప‌శ్చిమ్ బ‌ర్దమాన్ జిల్లాలోని ఆండాల్ విమానాశ్ర‌యంలో మీడియాతో మాట్లాడారు. అస‌న్ సోల్ దీదీ ప‌ట్ల పూర్తి అంకిత‌భావంతో ఉన్నార‌ని ఇందులో అనుమానం లేద‌న్నారు.

Also Read : బీజేపీపై బాబుల్ సుప్రియో సీరియ‌స్

Leave A Reply

Your Email Id will not be published!