Pat Commins Iyer : ప్రపంచ క్రికెట్ లో ఆసిస్ టెస్టు కెప్టెన్ పాట్ కమిన్స్ కు ఎంతో పేరుంది. మనోడు గతంలో ఐపీఎల్ లో ఆడాడు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఇటీవల బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో కేకేఆర్ స్టార్ ప్లేయర్ ను తీసుకుంది.
ఇక భారీ ధరకు టీమ్ మేనేజ్ మెంట్ శ్రేయస్ అయ్యర్ ను కొనుగోలు చేసింది. ప్రస్తుతం అతడికే కెప్టెన్సీగా ఛాన్స్ ఇచ్చింది. ఈసారి కొత్త ఆటగాళ్లకు ఛాన్స్ దక్కింది. ఈనెల 26 నుంచి ముంబై వేదికగా ఐపీఎల్ ప్రారంభం కానుంది.
గతంలో 8 జట్లు పాల్గొంటుండగా సారి 10 జట్లు ఆడతాయి. కరోనా కారణంగా బీసీసీఐ కేవలం ముంబై వేదికగా మాత్రమే ఐపీఎల్ నిర్వహిస్తోంది. ఆయా జట్లన్నీ ప్రాక్టీస్ లో మునిగి పోయాయి.
ఈ తరుణంలో పాట్ కమిన్స్(Pat Commins Iyer )ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ప్రస్తుత కేకేఆర్ స్కిప్పర్ శ్రేయస్ అయ్యర్ పై. తాను అయ్యర్ కలిసి గతంలో ఢిల్లీ జట్టు తరపున ఆడామన్నాడు.
అతడు పూర్తిగా కూల్ గా ఉండే వాడు. ఎక్కువగా ఎవరితో జోక్యం చేసుకోక పోవడం తనకు నచ్చిందన్నాడు కమిన్స్. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా రాణిస్తున్నాడని కొనియాడాడు.
అతడి సారథ్యంలో ఐపీఎల్ లో ఆడేందుకు ఎదురు చూస్తానని పేర్కొన్నాడు పాట్ కమిన్స్(Pat Commins Iyer ). ఇదిలా ఉండగా దుబాయి వేదికగా జరిగిన ఐపీఎల్ 14 సీజన్ టైటిల్ లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో కేకేఆర్ ఓటమి పాలైంది. రన్నరప్ గా నిలిచింది. క్రీడాభిమానుల్ని నిరాశ పరిచింది.
Also Read : ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ హవా