Chandrakant Patil Modi : మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) చీఫ్ చంద్రకాంత్ పాటిల్ (Chandrakant Patil Modi)ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ దేశం కోసం ప్రధానమంత్రి (Prime Minister) నిద్రకు దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఓ వైపు వత్తిళ్లు ఇంకో వైపు సమస్యలతో మోదీ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని పేర్కొన్నారు. దీంతో రోజుకు కనీసం 8 గంటలు నిద్ర పోవాల్సిన ప్రధాని కేవలం 2 గంటలు మాత్రమే నిద్ర పోతున్నారంటూ వాపోయారు చంద్రకాంత్ పాటిల్(Chandrakant Patil Modi).
24 గంటలకు గాను 22 గంటలు దేశం కోసం పని చేస్తున్నారని, దేశాన్ని ఎలా అభివృద్ధి పథంలోకి తీసుకు వెళ్లాలని తంటాలు పడుతున్నారంటూ వెనకేసుకు వచ్చారు. ఒక రకంగా స్వామి భక్తిని చాటుకున్నారు పాటిల్.
ఆయన ఈ సంచలన కామెంట్స్ ను మరాఠా లోని కొల్హాపూర్ నార్త్ అసెంబ్లీ (Kolhapur North Assembly) నియోజకవర్గానికి సంబంధించి జరిగిన ఉప ఎన్నికల ప్రచారంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీని ఆకాశానికి ఎత్తేశారు.
ఆయన లేక పోతే ఈ దేశం మరింత దిగజారి పోయి ఉండేదన్నారు. కానీ మోదీ వచ్చాక అక్రమార్కుల ఆటలు సాగ లేదన్నారు. యూపీలో నేరస్థుల ఆట కట్టించిన ఘనత బీజేపీదేనన్నారు.
ఇక మరాఠాలో రాబోయే అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. మోదీని దేశ ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన జీవితం మనందరికీ స్పూర్తి దాయకమన్నారు.
ఒక సామాన్య ఛాయ్ వాలా నుంచి నేడు దేశానికి ప్రధానిగా ప్రాతినిధ్యం వహిస్తున్న మోదీ తన జీవితమంతా దేశం కోసం పాటు పడుతున్నారంటూ కితాబు ఇచ్చారు చంద్రకాంత్ పాటిల్. ప్రస్తుతం పాటిల్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.
Also Read : ఆప్ అవకాశం ప్రజా సేవకు అంకితం