Priyanka Chopra Sona : ప్రియాంక సోనా రెస్టారెంట్ కు ఏడాది

భార‌తీయ వంట‌కాల‌కు భ‌లే గిరాకీ

Priyanka Chopra : ప్ర‌ముఖ బాలీవుడ్, హాలీవుడ్ న‌టి ప్రియాంక చోప్రా ఏరికోరి అమెరికాలో ప్రారంభించిన సోనా రెస్టారెంట్ దుమ్ము రేపుతోంది. ఏ ముహూర్తంలో స్టార్ట్ చేసిందో కానీ ఇప్పుడు టాప్ రెస్టారెంట్ల‌లో ఒక‌టిగా నిలిచింది.

భార‌తీయ వంట‌కాల‌కు పెట్టింది పేరు ఇది. ఆమె ఇప్ప‌టికే మోస్ట్ పాపుల‌ర్ న‌టుల్లో ఒక‌రిగా ఉన్నారు. త‌న క‌న్న చిన్న‌వాడైన నిక్ తో పెళ్లి చేసుకుని అంద‌రినీ ఆశ్చ‌ర్య పోయేలా చేసింది.

ఇటు బాలీవుడ్ అంటు హాలీవుడ్ ల‌లో ఫుల్ బిజీగా మారి పోయింది ప్రియాంక చోప్రా(Priyanka Chopra). సినిమాల‌తో పాటు హోస్ట్ గా , వెబ్ సీరీస్ లో కూడా న‌టిస్తూ చేతినిండా సంపాదిస్తోంది.

న‌టిగానే కాకుండా ప్రియాంక చోప్రాకు ఫుడ్డీ గా పేరుంది. ఆమె ఫ‌క్తు భోజ‌న ప్రియురాలుగా ఇప్ప‌టికే అంద‌రికీ తెలుసు. దీంతో త‌న అభిరుచుల‌కు త‌గ్గట్టుగా ఓ రెస్టారెంట్ పెడితే ఎలా ఉంటుంద‌నే ఆలోచించి వెంట‌నే గ‌త ఏడాది ఇదే రోజు అమెరికాలో సోనా పేరుతో రెస్టారెంట్ ను ఓపెన్ చేసింది.

ఈ అమ్మ‌డు స్టార్ట్ చేసిన వెంట‌నే ఫుల్ బిజీగా మారి పోయింది ఈ వంట‌కాల శాల‌. ఈ సంద‌ర్భంగా ఫుల్ ఖుష్ లో ఉంది ఈ అమ్మ‌డు. అమెరికా లోని న్యూయార్క్ ప్ర‌ధాన న‌గ‌రంలో దీనిని ఏర్పాటు చేయ‌డంతో గిరాకీ కూడా ఆశించిన దాని కంటే ఎక్కువ‌గా వుంటోంది.

ఈ సంద‌ర్భంగా త‌న ఆనందాన్ని పంచుకుంది ప్రియాంక చోప్రా(Priyanka Chopra). ఆమె ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మ‌రింత గ‌ర్వంగా ఉండలేనంటూ పేర్కొన్నారు.

స‌లాడ్ లు, ఇత‌ర దేశాల‌కు చెందిన వంట‌కాలు, పానియాలు, నాన్ వెజ్ తో పాటు వెజ్ టేరియ‌న్ వంట‌కాలు కూడా ఇక్క‌డ ఉన్నాయి. దోసె, వ‌డ‌లు, చాట్ వంటి భార‌తీయ రుచిక‌రమైన‌వి దొరుకుతాయి.

Also Read : పెళ్లి పీట‌లెక్క‌నున్న ప్రేమ జంట

Leave A Reply

Your Email Id will not be published!