Joe Biden : అమెరికా (America) చీఫ్ జోసెఫ్ బైడెన్ ఈమధ్య ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదు. ప్రపంచానికి పెద్దన్నగా తనను భావించుకునే యుఎస్ (USA) వరుసగా సాక్షాత్తు ఆ దేశాధ్యక్షుడు పదే పదే నోరు జారుతుండడంపై యావత్ అమెరికన్ ప్రజానీకం విస్మయం వ్యక్తం చేస్తోంది.
ఇప్పటికే అమెరికా (America) ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ ను ప్రథమ మహిళ అంటూ ఇటీవల పేర్కొన్నారు. పప్పులో కాలు వేశారు. వైట్ హౌస్ సాక్షిగా జరిగిన సమావేశంలో బైడెన్(Joe Biden) ప్రసంగించారు.
కమలా హారీస్ గురించి అలా మాట్లాడేసరికి అక్కడి అక్కడ హాజరైన వారంతా నవ్వుకున్నారు. దీంతో తప్పు తెలుసుకున్న అధ్యక్షుడు బైడెన్(Joe Biden) సరి చేసుకున్నారు. తాజాగా మరోసారి అమెరికా చీఫ్ నోరు జారారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. ప్రస్తుతం ట్రోలింగ్ లో నిలిచారు. ఆయన కామెంట్స్ పై నెటిజన్లు విపరీతంగా స్పందించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అమెరికా మాజీ చీఫ్ ఒరాక్ ఒబామా సతీమణి మిషల్ ఒబామా (Michelle) గురించి తప్పుగా మాట్లాడారు. మిషెల్ ను మాజీ ఉపాధ్యక్షురాలు అంటూ వ్యాఖ్యానించారు జోసెఫ్ బైడెన్.
ఇదిలా ఉండగా మిషెల్ (Michelle) డిప్యూటీ చీఫ్ గా ఉన్న సమయంలో మొదలైన పలు కార్యక్రమాలను ప్రస్తుతం ఉన్న ప్రథమ మహిళ ముందుకు తీసుకు వెళతారని ప్రశంసించడం చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే ఆఫ్గనిస్తాన్ , ఉక్రెయిన్ , బర్మా విషయంలో బైడెన్ తీసుకున్న నిర్ణయాలు ఆయనకే బెడిసి కొట్టాయి. బైడెన్ చేస్తున్న కామెంట్స్ ఆయన పరపతిని తక్కువ చేస్తున్నాయి.
Also Read : ప్రజలు డిసైడ్ చేస్తారు డబ్బులు కాదు