Balka Suman : ప‌బ్ ఓన‌ర్ బీజేపీ నేత కొడుకుది

ప‌ట్టుబ‌డిన వారిలో రేవంత్ మేన‌ల్లుడు

Balka Suman : తెలుగు రాష్ట్రాల‌లో సంచ‌ల‌నం సృష్టించిన హైద‌రాబాద్ బంజారా హిల్స్ లోని ర్యాడిస‌న్ బ్లూ హోట‌ల్ పై దాడి డ్ర‌గ్స్ కేసు వ్య‌వ‌హారంపై ప్ర‌భుత్వ విప్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్(Balka Suman) స్పందించారు.

ఆయ‌న భార‌తీయ జ‌న‌తా పార్టీ , కాంగ్రెస్ పార్టీ ల‌పై ఫైర్ అయ్యారు. పోలీసులు కేసును సీరియ‌స్ గా తీసుకున్నారు. ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు. తాజాగా ఫుడింగ్ ప‌బ్ ఘ‌ట‌న‌పై బాల్క సుమ‌న్ కీల‌క కామెంట్స్ చేశారు.

సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప‌బ్ నిర్వాహ‌కులు బీజేపీ నాయ‌కురాలు ఉప్ప‌ల శార‌ద కుమారుడు న‌డుపుతున్నాడ‌ని ఆరోపించారు. ప‌బ్ ఓన‌ర్ అభిషేక్ బీజేపీ యువ నాయ‌కుడంటూ ఫైర్ అయ్యారు.

ప‌బ్ వ్య‌వ‌హారంలో ప‌ట్టుబ‌డిన వారిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మేన‌ల్లుడు ప్ర‌ణయ్ రెడ్డి ఉన్నాడంటూ ప్ర‌క‌టించారు. ఈ ఘ‌ట‌న‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేత‌ల చిల్ల‌ర వ్య‌వ‌హారాలు బ‌య‌ట ప‌డుతున్నాయంటూ మండిప‌డ్డారు బాల్క సుమ‌న్(Balka Suman).

డ్ర‌గ్స్ అమ్మేది బీజేపీ, కాంగ్రెస్ పార్టీ స‌న్నిహితులేన‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. కేసు ద‌ర్యాప్తు పూర్త‌యితే మ‌రిన్ని పేర్లు బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని చెప్పారు.

డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేసే వారితోపాటు వాడుతున్న వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నార‌ని తెలిపారు బాల్క సుమ‌న్. త‌మ‌కు చిత్త శుద్ది లేకుంటే ఇంత మందిని ఎలా అదుపులోకి తీసుకుంటామ‌ని ప్ర‌శ్నించారు.

ఈ కేసులో ప‌ట్టుబ‌డిన వారిని ఎవ‌రినీ వ‌దిలి పెట్టే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. మాద‌క ద్ర‌వ్యాల‌పై త‌మ ప్ర‌భుత్వం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తోందంటూ స్పష్టం చేశారు.

Also Read : ఆ ప‌బ్‌కి అన్ని అనుమ‌తులూ ఉన్నాయి – ఎక్సైజ్ శాఖ

Leave A Reply

Your Email Id will not be published!