Sita Ramam Movie : ‘దుల్క‌ర్..ర‌ష్మిక’ సీతా రామం

కొత్త మూవీ టైటిల్ డిక్లేర్

Sita Ramam Movie  : ప్ర‌ముఖ న‌టుడు దుల్క‌ర్ స‌ల్మాన్ , నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా క‌లిసి న‌టిస్తున్న చిత్రానికి టైటిల్ ఫిక్స్ అయ్యింది. ఈ మేర‌కు మూవీ మేక‌ర్స్ శ్రీ‌రామ న‌వమి సంద‌ర్భంగా ప్ర‌క‌టించారు.

వీరిద్ద‌రి సినిమాకు సీతా రామం(Sita Ramam Movie )అని పేరు పెట్టారు. ఈ చిత్రానికి హ‌ను రాఘ‌వ పూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వైజ‌యంతి మూవీస్ దీనిని స‌మ‌ర్పిస్తోంది. స్వ‌ప్న సినిమా పతాకంపై ప్ర‌ముఖ టాలీవుడ్ నిర్మాత అశ్విని ద‌త్ , ప్రియాంక్ ద‌త్ క‌లిసి నిర్మిస్తున్నారు.

ఇది పూర్తిగా ప్రేమ‌, వినోదాత్మ‌క‌మైన చిత్రం. ఇందులో ప్ర‌ధాన పాత్ర‌లో మృణాళిని ఠాకూర్ క‌నిపించ‌నుంది. సీత పాత్ర‌లో ఆమెను ఎంపిక చేశాడు ద‌ర్శ‌కుడు. ఈ మేర‌కు మూవీ మేక‌ర్స్ టైటిల్ ను ఎంపిక చేసిన విష‌యాన్ని వీడియో ద్వారా పంచుకున్నారు.

ఇందులో అఫ్రీన్ అనే పాత్ర‌లో ర‌ష్మిక మంద‌న్నా న‌టించ‌నుంది. దుల్క‌ర్ స‌ల్మాన్ ఇందులో ఆర్మీ ఆఫీస‌ర్ గా న‌టిస్తుండ‌గా ఆయ‌న‌కు స‌హాయం చేసే పాత్ర‌లో ర‌ష్మిక ఉండ‌నుంది.

ఇది ఓ సైనికుడు శ‌త్రువుకు అప్ప‌గించిన యుద్దం అఫ్రీన్. ఈ వార్ లో ఆ సీతారాముల‌ను నువ్వే గెలిపించాలంటూ వాయిస్ వినిపిస్తుంది. ఇక సీతారామం మూవీకి (Sita Ramam Movie ) విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందిస్తున్నారు.

మ‌ణి ఛాయాగ్ర‌హ‌కుడిగా ఉండ‌నున్నారు. మూవీకి సంబంధించిన వీడియోను ర‌ష్మిక మంద‌న్నా త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది. రాముడు, సీత ఎవ‌రు అని ర‌ష్మిక అడిగిన వెంట‌నే దుల్క‌ర్ స‌ల్మాన్, మృణాల్ లు మ‌న‌కు ప‌రిచ‌యం అవుతారు ఇందులో.

గ‌త ఏడాద‌ది దుల్క‌ర్ స‌ల్మాన్ పుట్టిన రోజున ద‌ర్శ‌కుడు మూవీకి సంబంధించి పోస్ట‌ర్, మేకింగ్ వీడియోను పంచుకున్నారు. అత్యంత అందమైన క‌థ‌ల‌లో ఇది ఒక‌టి అంటూ పేర్కొన్నారు దుల్క‌ర్ స‌ల్మాన్.

Also Read : కేజీఎఫ్‌-2 కిర్రాక్ బ్లాక్ బ‌స్ట‌ర్ ప‌క్కా

Leave A Reply

Your Email Id will not be published!