Pooja Hegde : ఎఫ్‌-3 మూవీలో బుట్ట‌బొమ్మ హ‌ల్ చ‌ల్

పూజా హెగ్డే ఫోటో నెట్టింట్లో వైర‌ల్

Pooja Hegde : దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఎఫ్ -2 మూవీ టాలీవుడ్ లో ఓ సెన్సేష‌న్. ఊహించ‌ని రీతిలో కాసులు కొల్ల గొట్టింది. బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ మూవీ.

ఇందులో పండించిన కామెడీ క‌డుపుబ్బా న‌వ్వించింది. విక్ట‌రీ వెంక‌టేశ్ , వ‌రుణ్ తేజ్ , త‌మ‌న్నా భాటియా, మెహ‌రీన్ తో పాటు ప్ర‌గ‌తి , అన్న‌పూర్ణ‌, విజ‌య, ప్ర‌కాశ్ రాజ్ , త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రం ఇంటిల్లిపాదిని ఆనందింప చేసింది.

దీంతో ఎఫ్ -2కు సీక్వెల్ గా ఎఫ్ -3 మూవీని తెర‌కెక్కిస్తున్నారు అనిల్ రావిపూడి. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి కావ‌చ్చింది. ఇందులో స్పెష‌ల్ సాంగ్ చిత్రీక‌రిస్తున్నారు. ఇందులో పాన్ ఇండియా హీరోయిన్ గా పేరొందిన పూజా హెగ్డే(Pooja Hegde) న‌టించ‌డం విశేషం.

ఇందుకు సంబంధించి ఫోటో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. దీనిని షేర్ చేశారు ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. ఇటీవల పుష్ప రాజ్ మూవీలో స‌మంత ఊ అంటావా సాంగ్ సూప‌ర్ స‌క్సెస్ అయ్యింది.

సినిమాకు ఎంత పేరు వ‌చ్చింది ఈ పాట‌కు అంత పాపుల‌ర్ అయ్యింది. తాజాగా ఎఫ్ -3 మూవీలో స్పెష‌ల్ సాంగ్ లో న‌టిస్తుండ‌డం విశేషం. ఇప్ప‌టికే రంగ‌స్థ‌లం మూవీలో జిగేల్ రాణి లో న‌టించి మెప్పించింది.

మూవీ మేక‌ర్స్ ఇవాళ డిక్లేర్ చేశారు పూజా (Pooja Hegde)షూటింగ్ లో పాల్గొంద‌ని. ప్ర‌స్తుతం పూజా హాట్ టాపిక్ గా మారారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్ రాజు , శిరీష్ నిర్మించారు.

దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ మూవీకి సంగీతం అందించారు. ఇప్ప‌టికే ఫోటోలు, ట్రైల‌ర్ , సాంగ్స్ కిక్కు ఎక్కించేలా ఉన్నాయి.

Also Read : కేజీఎఫ్ 2 దెబ్బ‌కు పాత రికార్డులు మ‌టాష్‌

Leave A Reply

Your Email Id will not be published!