Elon Musk Twitter : టెస్లా కార్ల సిఇఓ, చైర్మన్ ఎలోన్ మస్క్ ఒక్కసారి అడుగు వేశాడంటే ఇక వెనక్కి తగ్గడం అంటూ ఉండదు. మనోడి ఆలోచనలు పాదరసం కంటే ప్రమాదకరంగా ఉంటాయి.
రాకెట్ కంటే వేగంగా సాగుతుంటాయి. ఎప్పుడు ఎక్కడ ఎవరిని టార్గెట్ చేస్తాడో, ఎలా ఎంటర్ అవుతాడో ఎవరూ చెప్పలేరు. అంతే కాదు ఏ కంపెనీలో తాను ఎలా షేర్స్ కొనుగోలు చేస్తాడో చెప్పలేరు.
అందుకే మస్క్ కు ముద్దుగా సైక్లోన్ మస్క్ (Elon Musk Twitter)అని పేరు పెట్టారు. మనోడి కన్ను ఇప్పుడు సోషల్ మీడియాను నిత్యం షేక్ చేస్తూ కోట్లాది జనాన్ని మెస్మరైజ్ చేస్తున్న ట్విట్టర్ (పిట్ట కూత)పై ఫోకస్ పెట్టాడు.
ఏకంగా 9.2 షేర్లు కొనుగోలు చేశాడు. దాదాపు రూ. 300 కోట్ల వాల్యూ ఇది. గత కొన్ని రోజుల నుంచి ట్విట్టర్ వేదికగా ట్వీట్ల తో హోరెత్తిస్తున్నాడు. అంతే కాదు తను అనధికార బోర్డు మెంబర్ గా ఉన్నప్పటికీ తాను రానంటూ కబురు పంపాడు.
దీని వెనుక ఏదో మతలబు ఉందని అనుకున్నారంతా. కానీ భారత్ కు చెందిన పరాగ్ అగర్వాల్ ప్రస్తుతం ట్విట్టర్ కు సిఇఓగా ఉన్నాడు. మనోడు వచ్చాక ట్విట్టర్ లో పెను మార్పులు తీసుకు వచ్చాడు.
అయితే ట్విట్టర్ లో ఏం జరుగుతుందో ఎవరికైనా తెలుసా అంటూ ఓ పోల్ కూడా నిర్వహించాడు. దీనిపై చర్చోపచర్చలు కూడా కొనసాగాయి. ట్విట్టర్ షేర్ యూజర్లకు భారీ ఆఫర్ కూడా ప్రకటించాడు టెస్లా సిఇఓ ఎలోన్ మస్క్(Elon Musk Twitter) .
ఇప్పుడున్న షేర్ల ధరల కంటే ఎక్కువగా ఇస్తానని వెల్లడించాడు. దీంతో ఇప్పుడు ట్విట్టర్ లో కలకలం మొదలైంది. ఏది ఏమైనా మనోడి కన్ను పడితే తట్టుకోవడం కష్టం.
Also Read : ఓలా నుంచి తప్పుకోవడం లేదు – సిఇఓ