Abdul Aala Fazili : క‌శ్మీర్ యూనివ‌ర్శిటీ పీహెచ్‌డి స్కాల‌ర్ అరెస్ట్

రెచ్చ‌గ‌ట్టేలే విద్రోహ క‌థ‌నం ప్ర‌చుర‌ణ

Abdul Aala Fazili  : క‌శ్మీర్ యూనివ‌ర్శిటీ పీహెచ్ డీ స్కాల‌ర్ ను అరెస్ట్ చేశారు. ఆన్ లైన్ మ్యాగ‌జైన్ ది కాశ్మీరీ వాలా లో అత్యంత రెచ్చ‌గొట్టేలా , దేశ ద్రోహానికి పాల్ప‌డేలా స‌ద‌రు స్కాల‌ర్ క‌థ‌నం రాశారు.

ఈ విష‌యాన్ని జ‌మ్మూ కాశ్మీర్ స్టేట్ ఇన్వెస్టిగేష‌న్ – ఎస్ఐఏ సోదాలు నిర్వ‌హించింది. స్కాల‌ర్ గా ఉన్న అబ్దుల్ ఆలా ఫాజిలీని(Abdul Aala Fazili) అదుపులోకి తీసుకుంది.

ఆయ‌న‌ను త‌న నివాసంలో ఉండ‌గా ప‌ట్టుకుంది. రాజ్ బాగ్ లోని ది కాశ్మీరీ వాలా కార్యాల‌యంలో సోదాలు నిర్వ‌హించింది. సౌరాలో ఉంటున్న ఎడిట‌ర్ ఫ‌హాద్ షాను అరెస్ట్ చేసిన‌ట్లు ఎస్ఐఏ వెల్ల‌డించింది.

శోధ‌న బృందాలు కంప్యూట‌ర్లు, ల్యాప్ టాల‌ప్ లు, ఇత‌ర డిజిట‌ల్ ప‌రిక‌రాల‌ను , మెటీరియ‌ల్ ను స్వాధీనం చేసుకున్నారు. బానిస‌త్వం సంకెళ్లు విరిగి పోతాయి అనే శీర్షిక‌తో ఫాజిలీ క‌థ‌నం రాశారు.

ఇందులో భార‌త్ కు వ్య‌తిరేకంగా జ‌మ్మూ కాశ్మీర్ కు అనుకూలంగా రాత‌లు ఉన్నాయి. ఉగ్ర‌వాదాన్ని కీర్తిస్తూ హింసాత్మ‌క మార్గంలో యువ‌త‌ను ప్రోత్స‌హించేలా అందులో ప‌దాలు ఉన్నాయంటూ ఎస్ఐఏ తెలిపింది.

ఇది క‌చ్చితంగా భార‌త దేశ ప్రాదేశిక స‌మ‌గ్ర‌త‌ను విచ్ఛిన్నం చేసే ల‌క్ష్యంతో వేర్పాటువాద – ఉగ్ర‌వాద ప్ర‌చారాన్ని కొన‌సాగించేందుకు అవ‌స‌ర‌మైన త‌ప్పుడు క‌థ‌నం ప్ర‌చురించారంటూ వెల్ల‌డించింది.

అంతే కాదు క‌థ‌నం బోధ‌నా ఉద్దేశంతో సూచ‌నాత్మ‌క భాష‌ను ఉప‌యోగించింది. ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల‌ను నిర్వ‌హించేందుకు వేర్పాటువాద అంశాల‌ను ప్రోత్స‌హించింద‌ని తెలిపింది ఎస్ఐఏ.

మౌలానా ఆజాద్ నేష‌న‌ల్ ఫెలోషిప్ ద్వారా 2021 మార్చి వ‌ర‌కు ఐదేళ్ల పాటు కేంద్ర స‌ర్కార్ నెల‌కు రూ. 30 వేలు చెల్లించింది

Also Read : విద్వేషం బీజేపీ నైజం – ఆప్

Leave A Reply

Your Email Id will not be published!