Upasana Konidela : ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, తారక్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ దేశ వ్యాప్తంగా బిగ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రూ. 1000 కోట్లకు పైగా వసూలు చేసింది.
భారీ సక్సెస్ మూటగట్టుకున్న సందర్భంగా రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల(Upasana Konidela) పంజాబ్ లోని స్వర్ణ దేవాలయాన్ని ( గోల్డెన్ టెంపుల్ )ను సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా టెంపులలో లంగర్ సేవలో పాల్గొన్నారు.
ఇది ఒక మధురమైన అనుభూతి. స్వర్ణ దేవాలయాన్ని సందర్శించు కోవడం నా జీవితంలో మరిచి పోలేనని పేర్కొంది. ఉపాసన (Upasana Konidela)తన ఇన్ స్టా గ్రామ్ లో దేవాలయాన్ని సందర్శించుకున్న ఫోటోలను షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి నెట్టింట్లో.
కాగా రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సక్సెస్ అయ్యాక మరో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. తను , తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి కలిసి నటించిన ఆచార్య మూవీ రిలీజ్ కానుంది.
ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. గోల్డెన్ టెంపులో సేవ చేయడం, అందులో పాల్గొనడం, దర్శించు కోవడం తన పూర్వ జన్మ సుకృతమని పేర్కొంది.
తన భర్త తరపున తాను ఆయన మరిన్ని సినిమాలు చేయాలని, అన్ని విజయవంతం కావాలని స్వర దేవాలయంలో కోరుకున్నానని తెలిపింది ఉపాసన కామినేని.
రామ్ చరణ్ పంజాబ్ లోని అమృత్ సర్ లో కియారా అద్వానీ సరసన తన 15వ చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ మూవీకి దిగ్గజ దర్శకుడు ఎస్. శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.
Also Read : హనుమంతుడి త్యాగం స్మరణీయం