Spain Queen Letizia : ఉక్రెయిన్ పై సైనిక చర్య పేరుతో యుద్దాన్ని కొనసాగిస్తూ వస్తున్న రష్యాకు షాక్ ఇచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది స్పెయిన్. ఇప్పటికే అమెరికా, ఫ్రాన్స్ , బ్రిటన్ తదితర దేశాలన్నీ ఆర్థిక ఆంక్షలు విధించాయి రష్యాపై. కానీ పుతిన్ తగ్గడం లేదు.
ఇప్పటి వరకు నిరాటంకంగా సాగుతున్న యుద్దంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లెక్కించ లేనంత ఆస్తి నష్టం వాటిల్లింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. శరణార్థులుగా మారారు.
ఇప్పటికే ఆయుధ సంపత్తిని అందజేస్తోంది అమెరికా. ఈ తరుణంలో స్పెయిన్ క్వీన్ లెటిసియా(Spain Queen Letizia) ఉక్రెయిన్ కు గ్రెనెడ్ షిప్ మెంట్ ను బహుమతిగా పంపింది.
తాము పంపిన ఈ గ్రెనేడ్లతో ఉక్రెయిన్ రష్యాపై విజయాన్ని సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆమె ట్వీట్ చేసింది. సంఖ్యా పరంగా ఉన్నతమైన శత్రువుపై తన సైన్యం పోరాట శక్తిని ప్రోత్సహించేందుకు తాను కూడా మద్దతు ఇస్తున్నట్లు తెలిపింది.
ఇదిలా ఉండగా స్పెయిన్ క్వీన్ ఉక్రెయిన్ కు బహుమతిగా ఇచ్చిన వార్త సోషల్ మీడియాను షేక్ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.
ఇదిలా ఉండగా ప్రసిద్ద టైమ్ మ్యాగజైన్ తన కవర్ స్టోరీగా ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ పేరుతో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
స్పెయిన్ నుంచి ఉక్రెయిన్ ఆయుధాల భారీ రవాణాను అందుకుందని విస్ గ్రాడ్ పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా నేను మీకు సంపూర్ణ విజయం సాధించాలని కోరుకుంటున్నానని కోరింది లెటిసియా.
ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన సందేశం మాత్రం ఆసక్తిని రేపింది.
Also Read : కాబూల్ లో పేలుడు 66 మంది దుర్మరణం