Sarkaru Vaari Paata : స‌ర్కారు వారి పాట పోస్ట‌ర్ సూప‌ర్

మే 12న రిలీజ్ కానున్న మూవీ

Sarkaru Vaari Paata  : ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రిన్స్ మ‌హేష్ బాబు , కీర్తి సురేష్ జంట‌గా తెర‌కెక్కించిన స‌ర్కారు వారి పాట (Sarkaru Vaari Paata )మూవీపై భారీ అంచ‌నాలు వున్నాయి. మూవీ మేక‌ర్స్ సినిమాకు సంబంధించి అప్ డేట్ ఇచ్చింది.

ఆదివారం స‌ర్కార్ వారి పాట సినిమాకు సంబంధించి పోస్ట‌ర్ ను విడుద‌ల చేసింది. ఈ చిత్రానికి ఎస్ ఎస్ థ‌మ‌న్ సంగీతం  అందిస్తుండ‌గా ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌లు దుమ్ము రేపుతున్నాయి.

ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ అందించేలా ద‌ర్శ‌కుడు ప్ర‌య‌త్నం చేశాడు. ఈనెల 2న సోమ‌వారం మూవీ ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు మేక‌ర్స్. రెండు రాష్ట్రాల‌లో ఎంపిక చేసిన కొన్ని థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శించ‌నున్నారు.

చూసేందుకు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ట్రైల‌ర్ ఓ రేంజ్ లో ఉంటుంద‌ని టాక్. సినిమా ప్ర‌మోష‌న్ లో భాగంగా విడుద‌ల చేసిన క‌ళావ‌తి సాంగ్ సెన్సేష‌న్ సృష్టించింది.

ఈ పాట‌ను అనంత్ శ్రీ‌రామ్ రాయ‌గా సిద్ శ్రీ‌రామ్ పాడారు. ఇప్ప‌టి వ‌ర‌కు యూట్యూబ్ లో 150 మిలియ‌న్ వ్యూస్ రాబ‌ట్టింది. త‌ర్వాతి సాంగ్ పెన్నీ సాంగ్ కూడా సూప‌ర్ టాక్ తెచ్చుకుంది.

సినిమాకు టేకింగ్, మహేష్ లుక్స్ బిగ్ అస్సెట్ గా భావిస్తున్నారు ఫ్యాన్స్. ఇక పెన్నీ సాంగ్ లో ప్రిన్స్ మ‌హేష్ బాబు తో పాటు ఆయ‌న కూతురు ఘ‌ట్ట‌మ‌నేని సితార న‌టించ‌డం ఇందులో వెరీ వెరీ స్పెష‌ల్.

సాంగ్ లిరిక్స్ ట్రెండింగ్ లో ఉండ‌డం విశేషం. ఈ పాట‌ను నాకేశ్ అజీజ్ పాడ‌గా అనంత్ శ్రీ‌రామ్ రాశారు.

Also Read : జ‌య‌మ్మ పంచాయితీ ప్రీరిలీజ్‌లో అలిగిన సుమ‌

Leave A Reply

Your Email Id will not be published!