Mahua Moitra : కాంగ్రెస్ అగ్ర నాయకుడు, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ నేపాల్ లో పెళ్లికి అటెండ్ అయిన వీడియో తీవ్ర దుమారానికి దారి తీసింది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ బీజేపీని లక్ష్యంగా చేసుకుంది. ఇదే సమయంలో రాహుల్ గాంధీ ఓ మహిళతో ఉన్న ఫోటోను షేర్ చేసింది.
దీనిని ఏమంటారు అంటూ ఓ క్యాప్షన్ కూడా జత చేసింది. దీనికి సెటైరికల్ గా బీజేపికి చెందిన కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ బీరు బాటిళ్లను ఓపెన్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది కాంగ్రెస పార్టీ. దీనిపై ఇతర పార్టీల నాయకులు స్పందించారు.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహూవా మోయిత్రా సంచలన కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీకి మద్దతు పలికారు. రాహుల్ గాంధీ లేదా ఎవరైనా నైట్ క్లబ్ లో ఉన్నా లేదా ప్రైవేట్ సమయంలో పెళ్లికి వెలితే తప్పేంటి అని ప్రశ్నించింది ఎంపీ.
ట్విట్టర్ వేదికగా స్పందించింది. 2008 ముంబై పేలుడు సమయంలో రాహుల్ గాంధీ కూడా పాలు పంచుకున్నారంటూ వీడియోను షేర్ చేసిన బీజేపీ సోషల్ మీడియా విభాగం హెడ్ అమిత్ మాల్వియాపై మండిపడ్డారు మహూవా మోయిత్రా(Mahua Moitra).
బీర్ తో డబుల్ లైఫ్ లను ఉత్తమంగా చేసే పనిని మీరు మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు ఎంపీ. స్నేహితుడి వివాహానికి హాజరు కావడం నేరం ఎలా అవుతుందని నిలదీశారు.
Also Read : తల్లి ఆశీర్వాదం యోగి ఆనందం