Ma Ma Mahesha : ‘మ మ మ‌హేషా’ సాంగ్ ప్రోమో మాస్

స‌ర్కారు వారి పాట సాంగ్ రేపే రిలీజ్

Ma Ma Mahesha : ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రిన్స్ మ‌హేష్ బాబు, కీర్తి సురేష్ , వెన్నెల కిషోర్ క‌లిసి న‌టించిన చిత్రం స‌ర్కార్ వారి పాట‌. ఇప్ప‌టికే ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

తాజాగా విడుద‌ల చేసిన స‌ర్కార్ వారి పాట మూవీ ట్రైల‌ర్ దుమ్ము రేపుతోంది. నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. విడుద‌లైన కొద్ది నిమిషాల్లోనే మిలియ‌న్ల వ్యూస్ తో రికార్డు క్రియేట్ చేస్తోంది.

ప‌రుశురామ్ టేకింగ్ , మ‌హేష్ బాబు అందంతో పాటు ఆక‌ట్టుకునే డైలాగ్ లు, ఫైట్స్ , లొకేష‌న్స్ , పిక్చ‌రైజేష‌న్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్ర‌తిదీ మ‌హేష్ బాబు రేంజ్ ను మ‌రింత పెంచేలా చేసింది.

దీంతో ఈ సినిమాపై అంచ‌నాలు మ‌రీ పెరిగి పోయాయి. ఈనెల 12న ప్ర‌పంచ వ్యాప్తంగా స‌ర్కార్ వారి పాట విడుద‌ల చేసేందుకు మూవీ మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.

ఇదే స‌మ‌యంలో చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్లు, పాట‌లు మోత మోగిస్తున్నాయి. క‌ళావతి సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేసింది. మ‌హేష్ లుక్స్ మెస్మ‌రైజ్ చేస్తుండ‌డంతో సినిమా ఎప్పుడు వ‌స్తుందా అన్న ఉత్కంఠ పెరుగుతోంది ఫ్యాన్స్ కు.

ఇక డైరెక్ట‌ర్ ప‌రుశు రామ్ మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నాడు. ఇక ఇప్పటికే ఈ మూవీ త‌ర్వాత దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ తో అత‌డు -2 మూవీ తీస్తుండ‌డం విశేషం.

స‌ర్కారు వారి పాట‌కు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ ఎస్ఎస్ థ‌మ‌న్ సంగీతం అందించ‌డం. పాట‌లు కిక్కు ఎక్కించేలా ఉన్నాయి. తాజాగా సినిమాకు సంబంధించి మ మ మ‌హేషా అన్న సాంగ్ ప్రోమో విడుద‌ల చేశారు మూవీ మేక‌ర్స్ . శ‌నివారం పూర్తి సాంగ్ రిలీజ్ కానుంది.

 

 

Also Read : Liger : లైగ‌ర్ ఆడియో 14 కోట్లు?

Leave A Reply

Your Email Id will not be published!