Delhi Lieutenant Governor : ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ రాజీనామా

రాష్ట్ర‌ప‌తి కోవింద్ కు స‌మ‌ర్ప‌ణ

Delhi Lieutenant Governor : ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్(Delhi Lieutenant Governor) (ఎల్జీ)గా ప‌ని చేస్తున్న అనిల్ బైజాల్ బుధవారం రాజీనామా చేశారు. విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు ఆయ‌న త‌న రాజీనామా లేఖ‌ను రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ కు పంపించారు.

వ్య‌క్తిగ‌త కార‌ణాల రీత్యా తాను త‌ప్పుకుంటున్న‌ట్లు తెలిపారు. ఢీల్లీకి ఎల్జీగా వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి సీఎంకు ఆయ‌న‌కు ప‌డ‌డం లేదు. ఇదిలా

ఉండ‌గా అనిల్ బైజాల్ 2017లో ఢిల్లీకి 21వ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్(Delhi Lieutenant Governor) గా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

అనిల్ బైజాల్ ఇండియ‌న్ అడ్మినిస్ట్రేటివ్ స‌ర్వీస్ కేడ‌ర్ కు చెందిన రైటైర్డ్ సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ సివిల్ సెర్వంట్ . న‌జీబ్ జంగ్ ఆక‌స్మిక రాజీనామా త‌ర్వాత 31 డిసెంబ‌ర్ 2016లో ఆయ‌న ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

ఆయ‌న హ‌ఠాత్తుగా 18న త‌న ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్నారు. అనిల్ బైజాల్ అల‌హాబాద్ విశ్వ విద్యాల‌యం నుంచి ఆర్ట్స్ లో మాస్ట‌ర్స్ డిగ్రీని, యూనివ‌ర్శిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా నుండి డెవ‌ల‌ప్ మెంట్ ఎక‌నామిక్స్ లో మాస్ట‌ర్స్ డిగ్రీ పొందారు.

బైజాల్ అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ – గోవా – మిజోరం – కేంద్ర పాలిత ప్రాంతం కేడ‌ర్ కు చెందిన 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆనాటి దివంగ‌త

ప్ర‌ధాన మంత్రి అట‌ల్ బిహారి వాజ్ పేయి ప్ర‌భుత్వం లో కేంద్ర హోం శాఖ కార్య‌ద‌ర్శిగా ప‌ని చేశారు.

ఇదిలా ఉండ‌గా ఆయ‌న కేంద్ర హోం శాఖ కార్య‌ద‌ర్శిగా ఉన్న స‌మ‌యంలో జైలు మాన్యువ‌ల్ లోని ప్ర‌తి నిబంధ‌న‌ను ఉల్లంఘించారని ఆరోపిస్తూ

కిర‌ణ్ బేడీని జైళ్ల అధిప‌తి ప‌ద‌వి నుంచి తొల‌గించారు. బైజాల్ ఢిల్లీ డెవ‌ల‌ప్ మెంట్ అథారిటీ చైర్మ‌న్ గా కూడా ప‌ని చేశారు.

స‌మాచార , ప్ర‌సార మంత్రిత్వ శాఖ‌లో అద‌న‌పు హోం కార్య‌ద‌ర్శి, ఇండియ‌న్ ఎయిర్ లైన్స్ కు ఎండీగా చేశారు. ప్ర‌సార భార‌తికి సిఇఓగా ఉన్నారు.

గోవా డెవ‌లప్ మెంట్ క‌మిష‌న‌ర్ గా ప‌ని చేశారు. 2006లో ప‌ట్ట‌ణాభివృద్ది మంత్రిత్వ శాఖ కార్య‌ద‌ర్శిగా ప‌ని చేసి ప‌ద‌వీ విర‌మ‌ణ పొందారు.

Also Read : భార‌త దేశం శ్రీ‌లంక‌ను త‌ల‌పిస్తోంది

Leave A Reply

Your Email Id will not be published!