Sameer Wankhede : స‌మీర్ వాంఖ‌డే పై బిగుస్తున్న ఉచ్చు

ఆర్య‌న్ ఖాన్ కు ఎన్సీబీ కోర్టు క్లీన్ చిట్

Sameer Wankhede : ఒక‌ప్పుడు ముంబైని గ‌డ‌గ‌డ లాడించిన సీనియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్ , యాంటీ నార్కోటిక్స్ అధికారి స‌మీర్ వాంఖ‌డే(Sameer Wankhede) ప‌రిస్థితి ఏమిట‌నేది చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్ప‌టికే ఆయ‌న‌పై ఓ కేసు న‌మోదైంది.

త‌ను త‌ప్పుడు స‌ర్టిఫికెట్ స‌మ‌ర్పించి ఉద్యోగం సంపాదించాడ‌ని, దీనిపై విచార‌ణ కొన‌సాగుతోంది. ఈ మేర‌కు త‌ను ద‌ళితుడినంటూ స‌ర్టిఫికెట్ ను జాతీయ ఎస్సీ, ఎస్టీ క‌మిష‌న్ కు కూడా స‌మ‌ర్పించాడు.

ఇదిలా ఉండ‌గా ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు షారుఖ్ ఖాన్ అలియాస్ బాద్ షా త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్ ను గ‌త ఏడాది 2021 డ్ర‌గ్స్ క‌లిగి ఉన్నాడంటూ అత‌డితో పాటు మ‌రో 14 మందిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఆప‌రేష‌న్ ను స‌మీర్ వాంఖ‌డే ఆధ్వ‌ర్యంలో జ‌రిగింది. ఆర్య‌న్ ఖాన్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజ‌రు ప‌రిచారు. ఇందులో ఇప్పుడు అరెస్టైన మంత్రి స‌మీర్ మాలిక్ మ‌నుమ‌డు కూడా ఉండ‌డం విశేషం.

అత‌డు డ్ర‌గ్స్ క‌లిగి ఉండ‌ట‌మే కాదు మొత్తం మాద‌క ద్ర‌వ్యాల స‌ర‌ఫ‌రాకు కింగ్ మేక‌ర్ గా ఉన్నాడ‌ని కేసు సంద‌ర్భంగా పేర్కొన్నాడు స‌మీర్ వాంఖ‌డే(Sameer Wankhede). అప్ప‌ట్లో అది సంచ‌ల‌నం.

ఈ మేర‌కు కోర్టు ఆర్య‌న్ ఖాన్ కు జైలు శిక్ష విధించింది. దీనిని స‌వాల్ చేస్తూ ఆర్య‌న్ ఖాన్ కోర్టును ఆశ్ర‌యించ‌డం, బెయిల్ మంజూరు చేయ‌డం జ‌రిగింది.

శుక్ర‌వారం ఎన్సీబీ ప్ర‌త్యేక కోర్టు ఆర్య‌న్ ఖాన్ త‌ర‌పున ఎలాంటి ఆధారాలు చూపించ లేక పోవ‌డంతో అత‌డికి క్లీన్ చిట్ ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

దీంతో స‌మీర్ వాఖండే కావాల‌ని ఆర్య‌న్ ఖాన్ ను టార్గెట్ చేశాడ‌న్న‌ది అర్థ‌మ‌వుతుంద‌ని బాలీవుడ్ వ‌ర్గాలు ఆరోపిస్తున్నాయి.

ఏది ఏమైనా ఓ వైపు త‌ప్పుడు కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రం, ఇంకో వైపు ఆర్య‌న్ ఖాన్ కేసు చివ‌ర‌కు స‌మీర్ వాంఖ‌డేపై చ‌ర్య ఉంటుందా అన్న‌ది వేచి చూడాల్సిందే.

Also Read : యూనివ‌ర్శిటీల‌కు ఛాన్సల‌ర్ గా సీఎం

Leave A Reply

Your Email Id will not be published!