Vijay Sai Reddy : మోసం చంద్రబాబు నైజం
విజయ సాయి రెడ్డి సంచలన కామెంట్
Vijay Sai Reddy : వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి విజయ సాయి రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఆయన తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడిపై మరోసారి నిప్పులు చెరిగారు. శుక్రవారం విజయ సాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు.
బాబుకు పదవి లేక పోతే ఊరికే ఉండలేడని పేర్కొన్నాడు. వంచన అనే తండ్రికి వెన్ను పోటు అనే తల్లికి పుట్టిన ఓ రాజకీయ ఉన్మాది అంటూ సంచలన ఆరోపణలు చేశారు విజయ సాయి రెడ్డి.
దివంగత దిగ్గజ నటుడు నందమూరి తారక రామారావుకు వెన్ను పోటు పొడిచి దొడ్డి దారిన సీఎం అయిన చంద్రబాబు నాయుడు ఏ ముఖం పెట్టుకుని మహానాడు చేస్తున్నాడంటూ ప్రశ్నించారు.
తలా తోకా లేకుండా మాట్లాడటం , ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు విజయ సాయి రెడ్డి. ఇప్పటికే ప్రజలు ఛీ కొట్టారు. ఆయన పార్టీని ఛీత్కరించారు.
కానీ బుద్ది రాలేదన్నారు. ప్రధానంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలపై చంద్రబాబు పగ సాధిస్తున్నారంటూ మండిపడ్డారు విజయ సాయి రెడ్డి(Vijay Sai Reddy).
ఎంతో ఉన్నత ఆశయంతో ఆనాడు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని, కానీ ఆయన ఆలోచనలు, ఆశయాలకు విరుద్దంగా ప్రవర్తించాడని ఆరోపించారు. నారా అంటేనే నాసిరకం రాజకీయం అని పేర్కొన్నారు.
చంద్రబాబు నాయుడిని తరిమి కొడితేనే ఏపీకి మంచి రోజులు వస్తాయని జోస్యం చెప్పారు. ఊ అంటే 40 ఏళ్ల రాజకీయం అంటారు.
గొప్పలు చెబుతారు. అంతా తానే చేశానంటూ ప్రకటించడం, తీరా అభాసు పాలవడం బాబుకే చెల్లిందన్నారు విజయ సాయి రెడ్డి. 14 ఏళ్ల కాలంలో ఎప్పుడైనా ఏమైనా సాధించారా అంటూ ప్రశ్నించారు.
Also Read : వైసిపికి రిటర్న్ గిఫ్ట్ గ్యారెంటీ : అచ్చెన్న