Malla Reddy Minister : నాపై దాడి వెనుక రేవంత్ కుట్ర
మంత్రి మల్లారెడ్డి సంచలన ఆరోపణ
Malla Reddy Minister : తనను చంపేందుకు రేవంత్ రెడ్డి(Revanth Reddy) కుట్ర పన్నాడని, అందులో భాగంగానే తనపై దాడికి యత్నించారంటూ సంచలన ఆరోపణలు చేశారు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి(Malla Reddy Minister). హైదరాబాద్ లో రెడ్డి సింహ గర్జన పేరుతో సభ జరిగింది.
దీనికి మంత్రి హాజరయ్యారు. ఆవేశంతో ప్రసంగించారు. ఇప్పటికే రెడ్లకే అధికారం ఉండాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇతర పార్టీలలో ఏమో కానీ తెలంగాణ సమాజంలో, ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది.
మిగతా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఇతర బహుజనులను ఆయన కించ పరిచారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో రెడ్డి గర్జన అని సభ పెట్టడం ఒకరిపై మరొకరు పొగుడు కోవడం సరి పోయింది.
ఇదే సమయంలో సభలో పాల్గొని ప్రసంగంచిన మల్లారెడ్డి(Malla Reddy Minister). తమ ప్రభుత్వం రెడ్లకు ఎంతో చేసిందని అన్నారు. సభలో ఉన్న వారు కొందరు మంత్రి కాన్వాయ్ ని వెంబడించారు. దాడి చేసేందుకు యత్నించారు.
దీంతో తీవ్ర కలకలం రేగింది. అనంతరం ఘటనకు సంబంధించి మంత్రి మల్లారెడ్డి ప్రగతి భవన్ లో సోమవారం మీడియాతో మాట్లాడారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై సంచలన ఆరోపణలు చేశారు.
ఆయన రాజకీయం పేరుతో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, తనను కూడా టార్గెట్ చేశాడని ఆరోపించారు. తన ఎదుగుదలను చూసి ఓర్వలేకే ఇలాంటి చిల్లర పనులు చేయిస్తున్నాడంటూ మండిపడ్డారు.
నాపై జరిగిన దాడి వెనుక రేవంత్ రెడ్డి హస్తం ఉందంటూ ఆరోపించారు మల్లారెడ్డి. రేవంత్ తనను చంపేందుకు కుట్ర పన్నాడు. దానిని ఛేదించి అతడి గూండాలను జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.
Also Read : తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ