Modi Yogi : యోగి ఆదిత్యానాథ్ డైనమిక్ లీడర్ – మోదీ
50వ పుట్టిన రోజు శుభాకాంక్షలు
Modi Yogi : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ డైనమిక్ లీడర్ అంటూ కితాబు ఇచ్చారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఆదివారం సీఎం యోగి పుట్టినరోజు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ప్రధాన మంత్రి.
ఈ దేశంలో మోదీ(Modi Yogi) తర్వాత అత్యంత జనాదరణ కలిగిన నాయకుడిగా పేరొందారు యోగి ఆదిత్యానాథ్. గోరఖ్ పూర్ నుంచి ఐదుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 2017లో ఉత్తర ప్రదేశ్ సీఎంగా కొలువు తీరారు.
తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి భారతీయ జనతా పార్టీని పవర్ లోకి తీసుకు వచ్చాడు యోగి. యూపీ రాష్ట్రంలో రెండోసారి ముఖ్యమంత్రిగా కొలువుతీరిన సీఎంగా చరిత్ర సృష్టించారు సీఎం.
ఆదివారంతో యోగి ఆదిత్యానాథ్ కు 50 ఏళ్లు నిండాయి. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియ చేస్తున్నారు. అభినందనలతో ముంచెత్తుతున్నారు. బీజీపీలో ఇప్పుడు విస్మరించలేని నాయకుడిగా ఎదిగారు యోగి ఆదిత్యానాథ్.
రాష్ట్రంలో అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేశారు. ప్రధానంగా నేరస్తుల పాలిట సింహ స్వప్నంగా మారారు. గ్యాంగ్ స్టర్లు, గ్యాంగ్ లీడర్లు , మాఫియా లీడర్లకు చుక్కలు చూపించాడు యోగి ఆదిత్యానాథ్(Modi Yogi).
ప్రస్తుతం బుల్ డోజర్లు చుక్కలు చూపిస్తున్నాయి. అక్రమార్కుల గుండెల్లో పరుగులు పెట్టిస్తున్నాయి. యోగి ఆదిత్యానాథ్ సమర్థవంతమైన నాయకత్వంలో యూపీ పురోగతి కొత్త శిఖరాలకు చేర్చిందని కితాబు ఇచ్చారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దడంలో కీలక పాత్ర పోషించాడని కితాబు ఇచ్చారు ప్రధాన మంత్రి.
Also Read : అమిత్ షాకు క్రీడా శాఖ ఇస్తే బెటర్