Gang Rape Case : గ్యాంగ్ రేప్ కేసులో ఐదుగురు అరెస్ట్
అంతా పొలిటికల్ లీడర్ల కొడుకులే
Gang Rape Case : దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన అమ్నేషియా పబ్ కేసులో కీలక అప్ డేట్ వచ్చింది. మొత్తం ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పాఠశాలకు చెందిన విద్యార్థులు ఈ గ్యాంగ్ రేప్(Gang Rape Case) కు పాల్పడ్డారు.
వీరిలో పలువురు ఉన్నత కుటుంబాలకు చెందిన పిల్లలు ఉన్నారని వెస్ట్ జోన్ డీసీపీ వెల్లడించారు. దీనిని తీవ్రంగా తప్పు పట్టారు బీజేపీ
ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఈ ఘటనను నిరసిస్తూ కాషాయ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
భారీ ఆగ్రవేశాల మధ్య గ్యాంగ్ రేప్ కేసు(Gang Rape Case) లో మైనర్ గా ఉన్న నాల్గో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐదో నిందితుడు మేజర్ అని ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు.
హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ ప్రాంతంలో మే 28న తన సహ విద్యార్థులు ఏర్పాటు చేసిన పార్టీకి వెళ్లిన 17 ఏళ్ల పాఠశాల విద్యార్థిని సామూహిక అత్యాచారం జరిగింది. ఇప్పటి వరకు ఐదుగురు నిందితులపై కేసు నమోదు చేశారు.
ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ నివేదిక కోరారు. 2 రోజుల్లో నివేదిక అందించాలని ఆదేశించారు. రేప్ కు
పాల్పడిన వారిలో కొందరిని కాపాడుతున్నారంటూ బీజేపీ నాయకులు ఆరోపించారు.
ఈ రేప్ ఘటనకు సంబంధించి రఘునందన్ రావు ఫోటోలు, వీడియోలను విడుదల చేశారు. దీంతో పోలీసు వర్గాలలో కలకలం రేపింది.
పోలీసులకు మాత్రమే అందుబాటులో ఉన్న ఆధారాలు ఆయనకు ఎలా లభించాయని ప్రశ్నించారు.
ఫోటోలో ఉన్న బాలుడు ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడా కాదా అని స్పష్టం చేయాలని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదులో
జాప్యంపై పోలీసులు వివరణ ఇవ్వాలని బాలల హక్కుల సంఘం కోరింది.
ఇదిలా ఉండగా అరెస్ట్ చేసిన వారిలో పొలిటికల్ లీడర్ల కొడుకులే ఉన్నారు. ఏ1 నిందితుడిగా సాదుద్దీన్ – ఎంఐఎం నేత కొడుకు. ఏ2 ఉమేర్
ఖాన్ – ఎమ్మెల్యే సోదరుడి కొడుకు ఉన్నారు.
మైనర్ -1 రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు. మైనర్ -2 ఎంఐఎం కార్పొరేట్ కొడుకు. మైనర్ 3 – సంగారెడ్డి మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ కొడుకు ఉన్నారని పోలీసులు వెల్లడించారు.
Also Read : గ్యాంగ్ రేప్ కేసుపై గవర్నర్ సీరియస్