Murari Vaa Song : మ‌హేష్‌ ‘మురారి వా’ సాంగ్ వారెవా

స‌ర్కారు వారి పాట న్యూ సాంగ్ అదుర్స్

Murari Vaa Song : ప‌రుశురామ్ ద‌ర్శ‌కత్వంలో ప్రిన్స్ మ‌హేష్ బాబు, ల‌వ్లీ గ‌ర్ల్ కీర్తి సురేష్ న‌టించిన సర్కారు వారి పాట విడుద‌లై భారీ విజ‌యాన్ని మూట‌గట్టుకుంది. రూ. 200 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించింది.

రిలీజ్ అయిన రోజున మిక్స్ డ్ టాక్ వ‌చ్చినా ఆ త‌ర్వాత మ‌హేష్ మూవీని ఆద‌రించ‌డం మొద‌లు పెట్టారు. ఇరు తెలుగు రాష్ట్రాల‌లోనే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ వ‌సూళ్లు రాబ‌ట్టింది ఈ మూవీ.

గ‌త నెల మే 12న థియేట‌ర్ల‌లో విడుద‌లైన స‌ర్కారు వారి పాట ఊహించ‌ని రీతిలో స‌క్సెస్ సాధించింది. ప్రిన్స్ మ‌హేష్ బాబు త‌న సినీ కెరీర్ లో ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

గ‌తంలో ఆయ‌న న‌టించిన పోకిరి, శ్రీ‌మంతుడు, భ‌ర‌త్ అనే నేను, మ‌హ‌ర్షి సినిమాల కంటే ఎక్కువ‌గా కోట్లు కుమ్మ‌రించేలా చేసింది.

రోజు రోజుకు సినిమాకు మ‌రింత ఆద‌ర‌ణ పెరుగుతుండ‌డంతో ఆడియ‌న్స్ కోసం ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్ , నిర్మాత‌లు మ‌రో సాంగ్ ను తెర‌కెక్కించారు.

ఇప్ప‌టికే ఎస్ఎస్ థ‌మ‌న్ అందించిన మ్యూజిక్ మ్యాజికే చేసేసింది. సాంగ్స్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచాయి. సోష‌ల్ మీడియాను షేక్ చేశాయి.

తాజాగా సినిమా స‌క్సెస్ ను ఎంజాయ్ చేసేందుకు ఇంకో కొత్త పాట‌ను మూవీ మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ పాట‌ను అనంత శ్రీ‌రామ్ రాశాడు. మ‌హేష్ ఇమేజ్ కు త‌గ్గ‌ట్టు మురారి వా(Murari Vaa Song) అనే పాట‌ను తెర‌కెక్కించారు.

ప్ర‌స్తుతం ఈ పాట దూసుకు పోతోంది. ఈ సాంగ్ లో మ‌రింత అందంగా క‌నిపిస్తున్నారు మహేష్ బాబు. కీర్తి సురేష్ డ్యాన్స్ , లొకేష‌న్లు ఆక‌ట్టుకునేలా తీశాడు ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్.

Also Read : ఎఫ్ 3 మూవీ వ‌సూళ్ల సునామీ

Leave A Reply

Your Email Id will not be published!