Al Qaeda Warns : ఆత్మాహుతి దాడులు చేస్తామంటూ హెచ్చరిక
దేశ రాజధాని ఢిల్లీ, ముంబైలో రెడ్ అలర్ట్
Al Qaeda Warns : మహ్మద్ ప్రవక్త పై భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్ నూపుర్ శర్మ, మీడియా ఇంఛార్జ్ నవీన్ జిందాల్ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా బీజేపీ సస్పెండ్ చేసింది.
దీనిపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 57 దేశాలు తీవ్రంగా తప్పు పట్టాయి. కొన్ని దేశాలలో భారత ఉత్పత్తుల అమ్మకాలను నిలిపి వేశారు.
ఈ తరుణంలో కొన్ని ఇస్లామిక్ దేశాలు మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందని, జోక్యం చేసుకోవాలంటూ ఐక్య రాజ్య సమితికి లేఖ రాశాయి. దీనిపై యూఎన్ స్పందించింది.
ఇప్పటికే భారత ప్రభుత్వం ఈ వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవని, కానీ ప్రభుత్వం తరపు నుంచి కావని స్పష్టం చేసింది. ఈ తరుణంలో ఆల్ ఖైదా సంస్థ ఆత్మాహుతి దాడులకు పాల్పడుతామంటూ హెచ్చరించింది.
ఢిల్లీ, ముంబయి, గుజరాత్, ఉత్తర ప్రదేశ్ లపై దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. మా ప్రవక్త గౌరవం కోసం పోరాడేందుకు తాము సిద్దంగా ఉన్నామని స్పష్టం చేసింది.
తమను తాము పేల్చేసు కోవడానికి సిద్దంగా ఉన్నామని పేర్కొంది. ఉప ఖండంలో అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ (ఏక్యూఐఎస్ ) భారత్ కు బెదిరింపులను జారీ చేసింది.
కాషాయ ఉగ్రవాదులు ఇప్పుడు ఢిల్లీ, ముంబై , యూపీ, గుజరాత్ లలో వారి అంతం కోసం వేచి ఉండాలంటూ ప్రకటన చేసింది.
మా ప్రవక్తను అవమానించే వారిని తాము చంపి తీరుతామని హెచ్చరించింది అల్ ఖైదా(Al Qaeda Warns). ఎటువంటి ఖండన లేదా బాధాకరమైన పదాలతో మూసి వేయబడదన్నారు.
Also Read : కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం