The Broken News : సోనాలీ ‘ది బ్రోకెన్ న్యూస్’ సూప‌ర్

బింద్రే న‌ట‌న అద్భుతం..మేకింగ్ కూడా

The Broken News : బాలీవుడ్ న‌టి సోనాలి బింద్రే గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఆమె న‌టించిన ది బ్రోకెన్ న్యూస్(The Broken News) ఆక‌ట్టుకునేలా ఉంది.

న‌ట‌న‌తో పాటు మేకింగ్ కూడా సూప‌ర్ అనిపించేలా తీశాడు ద‌ర్శ‌కుడు. నేటి స‌మాజంలో మీడియా ఎలా ఎంత‌టి శ‌క్తివంత‌మైన‌దో తెలియ చెప్పేలా తీసింది జీ .

ఇది వెబ్ సీరీస్ . ఈనెల 10న విడుద‌లైంది. మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ప్ర‌ధానంగా సోనాలీ బింద్రే నట‌న హైలెట్ గా నిలుస్తోంది. అహ్లావ‌త్ దీపాంక‌ర్ స‌న్యాల్ తెర మీద మ‌రింత ర‌క్తి క‌ట్టించేలా న‌టించాడు.

ది బ్రోకెన్ న్యూస్ వెబ్ సీరీస్ లో సోనాలీతో పాటు జైదీప్ , శ్రియా పిల్గావ్క‌ర్ న‌టించారు. దీనికి విన‌య్ వైకుల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ముంబైలో రెండు న్యూస్ చాన‌ళ్ల మ‌ధ్య జ‌రిగే యుద్దం ఇందులో చిత్రీక‌రించారు.

ఎలాంటి వార్త‌ల్ని ఇస్తారు. ఏది న్యూస్, ఏది వాస్త‌వం, వార్త‌లు కానివి ఎలా బ్రేకింగ్ న్యూస్ గా ప్ర‌త్య‌క్షం అవుతాయ‌నే దానిపై ఇందులో రూపొందించారు ద‌ర్శ‌కుడు.

ది బ్రోకెన్ న్యూస్(The Broken News)  వెబ్ సీరీస్ 8 భాగాలుగా వ‌స్తోంది జీ5లో. జ‌ర్న‌లిజానికి సంబంధించి రెండు వ్య‌తిరేక త‌త్వాల‌ను సూచిస్తాయి.

గ్యాంగ్ స్ట‌ర్ లు, సీక్రెట్ ఏజెంట్లు, యూనిఫాంలో ఉన్న పురుషుల ప‌ట్ల మ‌క్కువ‌తో కూడిన థ్రిల్ల‌ర్లు చాలా అరుదుగా ఎదుర్కొనే ప్ర‌శ్న‌ల‌ను ఇది ప్ర‌స్తావిస్తుంది.

నాట‌క ర‌చ‌యిత – స్క్రీన్ రైట‌ర్ మైక్ బార్ట్ లెట్ రూపొందించిన 2018 బీబీసీ వ‌న్ సీరీస్. సంబిత్ మిశ్రా స్క్రిప్ట్ అందించారు. ఇది ప్ర‌పంచంలోని అతి పెద్ద ప్ర‌జాస్వామ్యంలో పొందుతున్న ప్ర‌స్తుత వాస్త‌వాల‌ను ప్ర‌తిబింబించేలా తీశారు.

Also Read : ప‌క్ష‌వాతానికి గురైన స్టార్ సింగ‌ర్ బీబ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!