777 Charlie Movie : మ‌న‌సు దోచేస్తున్న ‘777 చార్లి’ మూవీ

రూ. 30 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు

777 Charlie Movie : క‌న్న‌డ నాట తీసిన 777 చార్లి చిత్రం(777 Charlie Movie) ఇప్పుడు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీసింది. క‌ర్ణాట‌క రాష్ట్ర సీఎం బ‌స‌వ‌రాజ్ బొమ్మై ఆ సినిమాను చూసి త‌ట్టుకోలేక పోయారు. క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు.

తాను ప్రాణ‌ప్ర‌దంగా పెంచుకున్న కుక్క‌ను గుర్తుకు తెచ్చేలా చేసిందంటూ వాపోయాడు. అంతే కాదు సీఎం ప్ర‌తి ఒక్క‌రిని ఈ మూవీ చూడాల‌ని పిలుపునిచ్చాడు.

ఇందులో అంద‌రూ అనుకున్న‌ట్లు క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ లేవు. బూతులు లేవు. ఊ అంటావా లాంటి పాట‌లు లేవు. క‌ళ్లు గ‌గుర్పొడిచే ఫైట్స్ కూడా లేవు.

కానీ సినిమా మాత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్ర‌శంస‌లు అందుకుంటోంది. ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ‌ను ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌శంసిస్తున్నారు. ఇలాంటి సినిమా(777 Charlie Movie) తీయాల‌న్న సంక‌ల్పాన్ని మెచ్చుకోకుండా ఉండ‌లేమంటున్నారు సినిమా రంగానికి చెందిన వారంతా.

ఈనెల 10న విడుద‌లైంది. ఇందులో క‌న్న‌డ హీరో ర‌క్షిత్ శెట్టి న‌టించాడు. కానీ సినిమాలో క‌న్నీళ్లు పెట్టించే స‌న్నివేశాలు బోలెడు ఉన్నాయి.

మ‌నిషికి, శున‌కానికి (డాగ్ ) మ‌ధ్య ఉన్న అనుబంధాన్ని తెర మీద ఎక్కించడంలో ద‌ర్శ‌కుడు కె. కిర‌ణ్ రాజ్ స‌క్సెస్ అయ్యాడు. ఇందులో న‌టించిన కుక్క గురించి ఎంత చెప్పినా త‌క్కువే.

సినిమాకు సంబంధించి 100 మార్కులు వేయాల్సి వ‌స్తే 80 మార్కులు ఆ శున‌కానికే వేయాల్సి వ‌స్తుంది. దానికి ట్రైనింగ్ ఇచ్చిన ట్రైన‌ర్ కు ఈ క్రెడిట్ ద‌క్కుతుంది.

ఫ‌క్తు వ్యాపారంగా మారిన ప్ర‌స్తుత సినీ రంగంలో ఇలాంటి స‌బ్జెక్టు ఎంచుకుని సినిమా తీసిన ద‌ర్శ‌కుడి నిబ‌ద్ద‌త‌, ప‌ట్టుద‌ల‌కు స‌లాం చేయాల్సిందే.

విచిత్రం ఏమిటంటే ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 30 కోట్ల‌కు పైగా కొల్ల‌గొట్టింది. ఇక ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసింద‌ని టాక్.

Also Read : కాశ్మీరీ పండిట్ల‌పై సాయి ప‌ల్ల‌వి కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!