Owaisi Modi : మోదీ మీ ఫ్రెండ్ అబ్బాస్ ను అడగండి
ప్రవక్త గురించిన కామెంట్స్ పై ఎంపీ ఓవైసీ
Owaisi Modi : ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(Owaisi Modi) సంచలన కామెంట్స్ చేశారు. ఆయన మరోసారి దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు.
తాజాగా తన చిన్ననాటి స్నేహితుడు అబ్బాస్ గురించి దేశ ప్రజలతో పంచుకున్నారు. ట్విట్టర్ లో పోస్ట్ కూడా చేశారు. తన తల్లి హీరా బెన్ 100వ సంవత్సరంలో అడుగిడిన సందర్భంగా మోదీ చిన్ననాటి ఫ్రెండ్ అబ్బాస్ పై ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ముహమ్మద్ ప్రవక్తపై భారతీయ జనతా పార్టీకి చెందిన నూపుర్ శర్మ సంచలన కామెంట్స్ చేశారు. ఆమెకు మద్దతుగా ఢిల్లీ మీడియా ఇన్ చార్జి నవీన్ కుమార్ జిందాల్ వరుస ట్వీట్లతో మద్దతు ఇచ్చాడు. వారిని అరెస్ట్ చేయాలంటూ దేశ వ్యాప్తంగా అల్లర్లు కొనసాగాయి.
ఈ తరుణంలో ప్రపంచంలోని 51 ఇస్లామిక్ దేశాలు తప్పు పట్టాయి. భారత ప్రభుత్వం క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశాయి. కానీ భారత్ పట్టించు కోలేదు. ఈ తరుణంలో భారత్ లో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగాయి.
పలు చోట్ల పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇక యూపీలో అయితే ముస్లిం నేతలను టార్గెట్ గా చేసుకుని బోల్డోజర్లతో తొక్కించారు సీఎం.
దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు ఎంపీ ఓవైసీ(Owaisi Modi). తాజాగా ప్రవక్తపై ఎలాంటి గౌరవం భావం ఉండాలో ప్రధాని నరేంద్ర మోదీ తన ఫ్రెండ్ అబ్బాస్ గురించి అడిగి తెలుసు కోవాలంటూ సూచించారు.
మహ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు సరైనవో కాదోనని మీ ఫ్రెండ్ ను అడగండి అంటూ కోరారు ఓవైసీ.
Also Read : ఈడీ ముందుకు రాహుల్ గాంధీ