Man Beaten Kissing : సరయు నదిలో సరసం భక్తుల ఆగ్రహం
భార్యను ముద్దు పెట్టుకున్న భర్తపై దాడి
Man Beaten Kissing : ప్రపంచం ఇప్పుడు చిన్నదై పోయింది. టెక్నాలజీ పెరిగింది. ఎప్పుడు ఎవరు కెమెరా క్లిక్ మనిపిస్తారో చెప్పలేం. ఎక్కడ ఏ స్పై కెమెరా ఉందో ఎవరూ చెప్పలేని పరిస్థితి ఉంది.
నాలుగు గోడల మధ్య ఉండాల్సినవన్నీ ఇప్పుడు బహిరంగంగా వచ్చేశాయి. కల్చర్ పొల్యూట్ అయి పోయింది. చుట్టూ జనం ఉన్నారన్న ధ్యాస మరిచి పోయి వ్యవహరిస్తే ఎలాంటి ఇబ్బంది తలెత్తుతుందో ఈ సన్నివేశం చూస్తే తెలుస్తుంది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హల్ చల్ చేస్తోంది. ఇక విషయంలోకి వెళితే ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది.
అయోధ్య లోని సరయూ నదిలో స్నానం చేస్తుండగా భార్యను భర్త ముద్దు(Man Beaten Kissing) పెట్టుకున్నాడు. కొంత దూరంలో స్నానం చేస్తున్న భక్తులు దీనిని గమనించారు.
పవిత్ర సరయూ నదిలో ఇలాంటి పాడు పనులు ఏంటి అంటూ నిప్పులు చెరిగారు. ఇంకేం భార్య వారించినా వినలేదు. భర్తకు దేహశుద్ది చేశారు. ఇలా దాడి చేస్తుండగా ఒకరు వీడియో తీశారు.
దానిని అప్ లోడ్ చేశారు. ప్రస్తుతం ఇది టాప్ ట్రెండింగ్ లో ఉంది. భార్య ఎంత వేడుకున్నా వారు వినలేదు. చివరకు ఎలాగో తప్పించుకున్నారు.
ఈ మొత్తం వ్యవహారం చర్చకు దారి తీసింది. ఈ మొత్తం ఘటనపై విచారణ జరిపి అవసరమైన చర్య పరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినట్లు అయోధ్య పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా గంగా నది ఏడు ఉప నదులలో సరయు నది ఒకటి. హిందువులు ఈ నదిని పవిత్రంగా భావిస్తారు. అయోధ్య రాముడి జన్మ స్థలం. సరయు నది ఒడ్డున ఉంది ఇది.
Also Read : మట్టిని కాపాడుకోక పోతే ప్రమాదం – సద్గురు
अयोध्या: सरयू में स्नान के दौरान एक आदमी ने अपनी पत्नी को किस कर लिया. फिर आज के रामभक्तों ने क्या किया, देखें: pic.twitter.com/hG0Y4X3wvO
— Suneet Singh (@Suneet30singh) June 22, 2022