Joe Biden : మ‌రోసారి త‌డ‌బ‌డిన జో బైడెన్

అమెరికా పేరు జపించ‌డంలో ట్రోల్

Joe Biden : వ‌య‌స్సు పెర‌గ‌డమా లేక ప‌రిపాల‌నా ప‌ర‌మైన ఒత్తిడి అన్న‌ది తెలియ‌డం లేదు అమెరికా దేశ అధ్య‌క్షుడు జోసెఫ్ బైడెన్(Joe Biden) మ‌రోసారి త‌డ‌బ‌డ్డారు.

ఆయ‌న ఇలా త‌డ‌బ‌డ‌డం ఇది మొదటిసారి కాదు గ‌తంలో కూడా నోరు జారారు. త‌ప్పుగా ఉచ్చ‌రించారు. ఆ త‌ర్వాత వైట్ హౌస్ స‌ర్ది చెప్పే ప్ర‌య‌త్నం చేశారు.

తాజాగా జో బైడెన్ అమెరికాను నిర్వ‌హించ‌డంలో, దానిని ప‌ల‌క‌డంలో త‌డ‌బాటుకు గుర‌య్యారు. ప్ర‌స్తుతం ఆయ‌న మాట్లాడిన మాట‌ల‌తో కూడిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

మ‌రోసారి సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారారు. 79 ఏళ్ల వ‌య‌స్సు క‌లిగిన జోసెఫ్ బైడెన్(Joe Biden) అమెరికాను ఒకే ప‌దంలో నిర్వ‌హించేందుకు ప్ర‌యత్నం చేశారు.

అమెరికా అన్న‌ది ఒకే ప‌దంలో నిర్వ‌చించ‌గ‌ల దేశం అని చెప్పారు. ఇదే స‌మ‌యంలో -ఎ- తో ప్రారంభ‌మ‌య్యే ప‌దాన్ని ఉచ్చ‌రించ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు.

ఇదే మొద‌టిసారి కాదు గ‌తంలో స‌మాన వేత‌న దినోత్స‌వం సంద‌ర్భంగా వైట్ హౌస్ లో ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక స‌మావేశంలో జోసెఫ్ బైడెన్ ప్ర‌సంగించారు.

ఇదే స‌మ‌యంలో అమెరికా ఉపాధ్య‌క్షురాలిగా ఉన్న ప్ర‌వాస భార‌తీయురాలు క‌మలా హారిస్ ను ఫ‌స్ట్ లేడీ అంటూ పిలిచాడు. క‌మ‌లా హారిస్ త‌న భ‌ర్త‌కు అనారోగ్యం ఉండ‌డం వ‌ల్ల ఆమె రాలేక పోయింది.

ఆమెను ఉద‌హ‌రిస్తూ ఎందుకు రాలేద‌న్న కార‌ణాన్ని వివ‌రిస్తూ బైడెన్ పై విధంగా కామెంట్ చేయ‌డం క‌ల‌క‌లం రేగింది. అప్ప‌ట్లో ప్ర‌పంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ప్ర‌స్తుతం బైడెన్ వీడియో వైర‌ల్ అవుతోంది.

Also Read : చైనాపై ఆస్ట్రేలియా ఉప ప్ర‌ధాని కామెంట్

Leave A Reply

Your Email Id will not be published!