Mamata Banerjee : ఏదో ఒక రోజు మీ పతనం తప్పదు – సీఎం
కేంద్ర సర్కార్ పై సీఎం షాకింగ్ కామెంట్స్
Mamata Banerjee : కేంద్రంలో కొలువు తీరిన మోదీ సర్కార్ పై సంచలన కామెంట్స్ చేశారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. గురువారం ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు.
మోదీ త్రయం ఆడుతున్న కుట్రలో భాగమే ఇవాళ మహారాష్ట్రలో చోటు చేసుకున్న ప్రతిష్టంభన. ఒకే దేశం ఒకే భాష ఒకే పార్టీ ఉండాలన్న నినాదం అత్యంత పాశవికమైనది.
అది నిరంకుశత్వాన్ని సూచిస్తుంది. ఇప్పటికే దేశమంతటా విస్తరించాలని ఇప్పటికే 8 రాష్ట్రాలలో కుట్ర పూరితంగా ప్రభుత్వాలను పడగొట్టారు. దీనిని ప్రజలు గమనిస్తున్నారు.
ఇవాళ మీరు అధికారంలో ఉండవచ్చు. మీ చేతుల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలు, మందీ మార్బలం, పోలీసులు, వ్యాపారులు అండగా ఉండవచ్చు. కానీ ఏదో ఒక రోజు మీరు పతనం కాక తప్పదు.
కాలం ఎప్పుడూ ఒకే రీతిన ఉండదని తెలుసు కోవాలని మమతా బెనర్జీ(Mamata Banerjee) హెచ్చరించారు. డబ్బులు వెదజల్లారు, పదవులు ఆశ చూపారు. లొంగని వారిని ఈడీ, సీబీఐ తో దాడులు చేస్తామని బెదిరింపులకు గురి చేశారు.
ఏదో ఒక రోజు విపక్షాలకు కూడా అధికారం వస్తుంది. ఆరోజు కూడా మీరు కూడా ఇలాంటి వేధింపులకు, కుట్రలకు బలికాక తప్పదని వార్నింగ్ ఇచ్చారు సీఎం. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని సూచించారు.
ఇప్పటికే బీజేపీయేతర ప్రభుత్వాలను టార్గెట్ గా పెట్టుకున్నారు. రెబల్ ఎమ్మెల్యేలను బలవంతంగా హోటల్ లో బంధించారు.
ఇదేనా మీ హిందూత్వ ఎజెండా అని నిలదీశారు మమతా బెనర్జీ(Mamata Banerjee). మీ పార్టీలో కూడా ఎవరైనా విచ్చిన్నానికి పాల్పడవచ్చు జాగ్రత్త అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య యుతంగా ఏర్పాటైన మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చ వద్దని కోరుతున్నానని తెలిపారు.
Also Read : ద్రౌపది ముర్ముకు మోదీ అభినందన