Mahua Moitra : మ‌హ్మ‌ద్ జుబైర్ అరెస్ట్ పై మ‌హూవా ఫైర్

పోలీసుల తీరు దారుణ‌మ‌ని ఆగ్ర‌హం

Mahua Moitra : ఫాక్ట్ చెకింగ్ వెబ్ సైట్ వ్య‌వ‌స్థాప‌కుడు జుబైర్ అరెస్ట్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మ‌త ప‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసినందుకు అత‌డిని అదుపు లోకి తీసుకున్నారని మ‌రో ఫౌండ‌ర్ సిన్హా ఆరోపించారు.

జుబైర్ అరెస్ట్ పై తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మ‌హూవా మోయిత్రా స్పందించారు. పోలీసుల తీరు దారుణ‌మ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మంగ‌ళ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆరోపించారు.

దీని వెనుక కేంద్ర స‌ర్కార్ కుట్ర దాగి ఉందంటూ మండిప‌డ్డారు. ఢిల్లీ పోలీసులు సాహిబ్ ల‌ను మెప్పించేందుకే ఇలా చేశారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

మ‌హూమాతో పాటు కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్‌, వాయునాడు ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. జుబైర్ అరెస్ట్ అక్ర‌మ‌మ‌ని వెంట‌నే విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్ర‌భుత్వం దీనిపై స్పందించాల‌ని అన్నారు. ఇదిలా ఉండ‌గా ఢిల్లీ పోలీసులు హోం వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ‌కు నివేదిక అందించారు జుబైర్ అరెస్ట్ వ్య‌వ‌హారంపై.

ఈ నెల ప్రారంభంలో స‌స్పెండ్ అయిన బీజేపీ నాయ‌కురాలు నూపుర్ శ‌ర్మ ప్ర‌వ‌క్త‌పై చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు అనేక రాష్ట్రాల‌లో హింస‌ను ప్రేరేపించింది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఆమెను ఎందుకు అరెస్ట్ చేయ‌లేద‌ని టీఎంసీ ఎంపీ మ‌హూవా మోయిత్రా(Mahua Moitra) ప్ర‌శ్నించారు ట్విట్ట‌ర్ వేదిక‌గా. మ‌రో వైపు ఒక స‌త్య‌వాణిని అరెస్ట్ చేస్తే మ‌రో వేయి మంది పుట్టుకు వ‌స్తారంటూ సంచ‌ల‌న కామెంట్ చేశారు రాహుల్ గాంధీ.

ద్వేష పూరిత ప్ర‌సంగం చేసిన వ్య‌క్తి స్వేచ్ఛ‌గా తిరుగుతూ ఉండ‌డం ఎంత విడ్డూర‌మంటూ కేర‌ళ ఎమ్మెల్యే మునీర్ ప్ర‌శ్నించారు.

Also Read : ఇది బాలా సాహెబ్ హిందూత్వ విజ‌యం

Leave A Reply

Your Email Id will not be published!