PM Modi : యావత్ ప్రపంచం ప్రస్తుతం భారత్ వైపు చూస్తోంది. మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా ఇప్పటికే నరేంద్ర మోదీని గుర్తించాయి. తనను తాను ప్రెజెంట్ చేసుకోవడంలో ఆయన ప్రత్యేకతను చాటుతూ వస్తున్నారు.
అంతే కాదు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా మోదీ వ్యవహరించడం ఆయనను స్పెషల్ గా చూస్తోంది ప్రపంచం. ఆహార్యంలోనూ , మాట తీరులోనూ ప్రధాన మంత్రి(PM Modi) ప్రత్యేకతను కలిగి ఉంటున్నారు.
ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా మోదీ కొలువు తీరాక భారత విదేశాంగ విధానంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. దేశం అనుసరిస్తున్న విధానాని పలు దేశాలు ప్రశంసిస్తున్నాయి.
ఎక్కడా రాజీ పడడం లేదు. తమ నిర్ణయాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో మోదీ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఆయన ప్రధానమంత్రిగా కొలువు తీరాక తాను ఏది చేసినా అది అమలు అయ్యింది.
కానీ ఒకే ఒక్క విషయంలో మాత్రం కొంత ఇబ్బంది పడ్డారు. అదే దేశ వ్యాప్తంగా రైతులు చేపట్టిన అకుంఠిత ఆందోళన. ఆ బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా జాతికి క్షమాపణలు కూడా చెప్పారు. ఇది ఒక్కటి తప్పితే ఆయన దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
మరో వైపు దాయాది శ్రీలంక దేశానికి సాయం అందించడంలో మోదీ కీలక పాత్ర పోషించారు. అంతే కాదు తాలిబన్లు స్వాధీనం చేసుకున్న ఆఫ్గనిస్తాన్ ను ఆదుకోవడంలో బారత్ ముందంజలో ఉంది.
మొన్నటికి మొన్న జరిగిన భారీ భూకంపానికి చెల్లా చెదురైన వారందరికీ ఆపన్న హస్తం అందించేలా చేయడంలో ప్రధాని పాత్ర ముఖ్యమైనది. తాజాగా జర్మనీలో పర్యటించిన మోదీకి జనం జేజేలు పలికారు.
ప్రధానంగా అమెరికా చీఫ్ బైడెన్ సైతం మోదీ తో కరచాలనం చేయడం విశేషం.
Also Read : కీలక అంశాలపై జీ7లో మోదీ ప్రస్తావన