Sharad Pawar Fadnavis : ఫడ్నవీస్ సంతోషంగా లేడు – పవార్
డిప్యూటీ సీఎం పదైవి ఎన్సీపీ చీఫ్ కామెంట్
Sharad Pawar Fadnavis : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన బాంబు పేల్చారు. భారతీయ జనతా పార్టీ చీఫ్ దేవేంద్ర ఫడ్నవీస్ చివరి దాకా సీఎం అవుతారని అంతా అనుకున్నారని, కానీ డిప్యూటీ సీఎంగా ప్రమాణం స్వీకారం చేయడంతో సంతోషంగా లేడని పేర్కొన్నాడు.
ఫడ్నవీస్ ఎప్పుడైనా నెంబర్ వన్ గా ఉండాలని కోరుకుంటాడని, కానీ నెంబర్ 2 గా ఉండాలని అనుకోవడన్నారు. తాను కూడా ఆయన సంతోషంగా ఉన్నాడని భావించడం లేదన్నారు.
ఇప్పటికే మహా వికాస్ అఘాడీ లో మంత్రిగా ఉన్న ఏక్ నాథ్ షిండే శివసేన పార్టీపై తిరుగుబాటు జెండా ప్రకటించాడు. పలువురు ఎమ్మెల్యేలతో క్యాంప్ ఏర్పాటు చేశాడు.
దీని వెనుక ఉంటూ మొత్తం మంత్రాంగం నడిపించింది అంతా దేవేంద్ర ఫడ్నవీస్. చివరి క్షణం వరకు ఫడ్నవీస్ సీఎం అవుతాడని ప్రతిపక్ష పార్టీలతో పాటు భారతీయ జనతా పార్టీ శ్రేణులు కూడా భావించాయి.
కానీ ఊహించని రీతిలో బీజేపీ హై కమాండ్ షాక్ ఇచ్చింది. మాస్ లీడర్ గా పేరొందిన ఏక్ నాథ్ షిండేను సీఎంగా ప్రకటించింది. ఊహించని ట్విస్ట్ ఇవ్వడమే కాదు ఫడ్నవీస్ కు కోలుకోలేని రీతిలో చెక్ పెట్టింది.
ఈ తరుణంలో ఆయన అయిష్టంగానే ఒప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు ఫడ్నవీస్ రెండు సార్లు సీఎంగా పని చేశారు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలపై కలకలం రేగింది.
అగ్నికి ఆజ్యం పోసినట్లు శరద్ పవార్ ఫడ్నవీస్ (Sharad Pawar Fadnavis) పై చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
Also Read : మరాఠా యోధుడే నాకు ఆదర్శం