Liger Poster Viral : లైగ‌ర్ విజ‌య్ పోస్ట‌ర్ సెన్సేష‌న్

సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్

Liger Poster Viral : పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అనన్య పాండే , మైక్ టైస‌న్ క‌లిసి న‌టిస్తున్న మూవీ లైగ‌ర్ మూవీపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇప్ప‌టికే రిలీజ్ చేసిన పోస్ట‌ర్ల‌కు భారీ స్పంద‌న వ‌చ్చింది.

తాజాగా లైగ‌ర్ మేక‌ర్స్ శ‌నివారం కొత్త పోస్ట‌ర్(Liger Poster Viral) ను విడుద‌ల చేశారు. సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ సృష్టిస్తోంది. ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ ఎలాంటి దుస్తులు లేకుండా ఉండ‌డం క‌ల‌కలం రేపుతోంది.

చిత్రం పోస్ట‌ర్ గురించి ఇలా పేర్కొన్నారు న‌టుడు. న‌ట‌న ప‌రంగా, మాన‌సికంగా, శారీర‌కంగా నేను న‌టిస్తున్న ఈచిత్రంలో నా పాత్ర అత్యంత ప్రాముఖ్య‌త క‌లిగి ఉంద‌న్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

ఇది స‌వాల్ తో కూడిన పాత్ర‌. ఈ చిత్రం త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌న్నాడు. పెద్ద ఎత్తున అభినంద‌న‌ల‌తో ముంచెత్తుతున్నారు. ఫ్యాన్స్ అయితే ఆగ‌డం లేదు.

విజ‌య్ దేవ‌ర‌కొండ ఐ ల‌వ్ యూ అంటూ ఎమోజీల‌తో దుమ్ము రేపుతున్నారు. ఇక లైగ‌ర్ లో న‌టించిన అన‌న్య పాండే అయితే బ్రీత్ గైస్ బ్రీత్ ..దుమ్ము రేపేందుకు రెడీగా ఉందంటూ స్ప‌ష్టం చేసింది.

పూరీ జ‌గ‌న్నాథ్, విజ‌య్ దేవ‌ర‌కొండ క‌లిసి చేస్తున్న ఈ లైగ‌ర్ మూవీ సంచ‌ల‌నం రేపేందుకు రెడీగా ఉందంటూ పేర్కొన్నారు మూ మేక‌ర్స్.

పూరీ క‌నెక్ట్స్ , ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ కింద క‌ర‌ణ్ జోహార్ , ఛార్మీ కౌర్ , అపూర్వ మెహ‌తా , య‌ష్ జోహార్ క‌లిసి నిర్మించారు. ఈ లైగ‌ర్ మూవీ 25 ఆగ‌స్టు న ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది.

Also Read : హాట్ సారీ లో హాట్ ఫోజులిచ్చిన లావణ్య త్రిపాఠి

Leave A Reply

Your Email Id will not be published!