Rahul Gandhi : వాయ‌నాడులో రాహుల్ కు జ‌నాద‌ర‌ణ

నిన్న చిన్నారి చిత్రం..ఇవాళ మ‌హిళకు ప‌రామ‌ర్శ‌

Rahul Gandhi : కేర‌ళ ప‌ర్య‌ట‌న‌లో బిజీ బిజీగా ఉన్నారు కాంగ్రెస్ మాజీ చీఫ్‌, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ. నిన్న ఓ చిన్నారి రాహుల్ గాంధీ వ‌ద్ద‌కు తానే స్వ‌యంగా వెళ్లి ప‌ల‌క‌రించింది.

అంతేనా ఆ పాపకు ప‌ట్టుమ‌ని ఐదేళ్లు కూడా ఉండ‌వు. కానీ రాహుల్ గాంధీ(Rahul Gandhi)  అంటే అభిమానం. తానే స్వ‌యంగా రాహుల్ ఫోటోను గీసింది. ఆయ‌న‌కు బ‌హుమ‌తిగా అంద‌జేసింది.

తాజాగా రాహుల్ గాంధి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న వాయ‌నాడు లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు కార్య‌క్ర‌మాల‌లో పాల్గొన్నారు. కొన్ని ప‌నుల‌ను ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా కొంత సేపు సేద దీరేందుకు ఓ హోట‌ల్ లో ఆసీనుల‌య్యారు. రాహుల్ గాంధీ వెంట మ‌రో ఎంపీ కేసీ వేణుగోపాల్ కూడా ఉన్నారు. అనుకోకుండా అక్క‌డ రాహుల్ గాంధీ ఉన్నార‌ని తెలుసుకున్న వృద్ధ మ‌హిళ వ‌చ్చింది.

ఆయ‌న‌ను ఆప్యాయంగా ప‌ల‌క‌రించింది. ఈ సంద‌ర్భంగా ఆమెను ఆలింగ‌నం చేసుకుని భ‌రోసా ఇచ్చారు రాహుల్ గాంధీ. ఎలాంటి ప్ర‌చార ఆర్భాటాలు లేకుండా సాధార‌ణంగా ప్ర‌జ‌ల మ‌ధ్య క‌లిసి పోయే ఇలాంటి నాయ‌కుడు కావాల‌ని ప‌లువురు కోరుతున్నారు.

ఇదిలా ఉండ‌గా మ‌హిళ రాహుల్ గాంధీని(Rahul Gandhi)  క‌లిసిన ఫోటోను కాంగ్రెస్ పార్టీతో పాటు కేసీ వేణుగోపాల్ షేర్ చేశారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోతో పాటు వీడియో కూడా సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

వేలాది మంది అభిమానులు త‌మ నేత సింప్లిసిటీని చూసి పొంగి పోతున్నారు. ఇలాంటి నాయ‌కుడే దేశానికి కావాల‌ని కోరుతున్నారు. రాహుల్ జీ జీతే ర‌హో.

Also Read : గుజ‌రాత్ లో ఆప్ జెండా ఎగ‌ర‌డం ఖాయం

Leave A Reply

Your Email Id will not be published!