Budi Mutyala Naidu: అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ !

అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ !

Budi Mutyala Naidu: అనకాపల్లి లోక్‌సభ స్థానానికి అభ్యర్థి పేరును వైసీపీ ప్రకటించింది. ఇటీవల ప్రకటించిన జాబితాలో మాడుగుల అసెంబ్లీ టిక్కెట్టు కేటాయించిన పార్టీ సీనియర్ నేత, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడిని అనకాపల్లి పార్లమెంట్ బరిలో నిలుపుతున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం పేర్కొంది. అంతేకాదు మాడుగుల అసెంబ్లీకు బూడి ముత్యాలనాయుడు(Budi Mutyala Naidu) కుమార్తె ఈర్లి అనురాధను ఎంపిక చేసినట్లు తెలిపింది. దీనితో ఒకే పార్లమెంట్ పరిధిలో తండ్రీ, కుమార్తెలకు టిక్కెట్టు ఇచ్చిన బరిలో దించినట్లు అయింది. ఇప్పటికే 175 ఎమ్మెల్యే, 24 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన వైసీపీ… ఒక్క అనకాపల్లి ఎంపీ సీటు మాత్రం పెండింగ్‌లో ఉంచిన సంగతి తెలిసిందే. అయితే ఆ పెండింగ్ స్థానాన్ని కూడా మంగళవారం ప్రకటించడంతో వైసీపీ పూర్తి జాబితా విడుదల చేసినట్లయింది.

Budi Mutyala Naidu

విపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికు సంబంధించి బయటి వ్యక్తి అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్ధిగా పోటీ చేస్తారన్న సమాచారంతో… వైసీపీ అధిష్టానం కేవలం అనకాపల్లి పార్లమెంట్ స్థానాన్ని పెండింగ్ లో ఉంచి రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 24 పార్లమెంట్ అభ్యర్ధులను ప్రకటించింది. అయితే ఎన్డీఏ కూటమి అభ్యర్ధిగా సీఎం రమేష్ ను బరిలో దించుతున్నట్లు బీజేపీ అధిష్టానం ప్రకటించడంతో… వైసీపీ కూడా తమ అభ్యర్ధిని ప్రకటించింది. సీఎం రమేష్ సామాజిక వర్గమైన వెలమ సామాజిక వర్గానికి చెందిన మాడుగుల సిట్టింగ్ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడ్ని అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్ధిగా ప్రకటించింది. ఆయన స్థానంలో అతని కుమార్తె ఈర్లి అనురాధను మాడుగుల అసెంబ్లీ నుండి బరిలో దించుతున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. దీనితో అనకాపల్లి పోరు రసవత్తరంగా మారుతోంది.

Also Read : AP CM YS Jagan : ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ ను సందర్శించి బస్సు యాత్ర షురూ చేసిన సీఎం

Leave A Reply

Your Email Id will not be published!