TBGSK: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ ! బీఆర్ఎస్‌కు ‘రాం రాం’ చెప్పిన టీబీజీకేఎస్ !

బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ ! బీఆర్ఎస్‌కు ‘రాం రాం’ చెప్పిన టీబీజీకేఎస్ !

TBGSK: పార్లమెంట్ ఎన్నికల ముందు పార్టీను వీడుతున్న నేతలతో సతమతమవుతున్న బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం టీబీజీకేఎస్… బీఆర్ఎస్‌కు ‘రాం రాం’ చెప్పింది. దీనితో సింగరేణిలో కారు పార్టీకి భారీ ఝలక్ తగిలినట్టయ్యింది. గులాబీ పార్టీతో టీబీజీకేఎస్ తెగదెంపులు చేసుకుంది.

TBGSK Shock to BRS

ఇక స్వతంత్రంగా వ్యవహరించాలని ఆ సంఘం తీర్మానం చేసింది. ఈ మేరకు ఏప్రిల్‌‌‌లో కొత్త కమిటీలను టీబీజీకేఎస్ ఏర్పాటు చేయనుంది. దీంతో కార్మిక సంఘం తీసుకున్న ఈ నిర్ణయంతో వరంగల్, పెద్దపల్లి, అదిలాబాద్, ఖమ్మం లోక్ సభ సీట్లలో గులాబీ పార్టీకి కార్మికుల ఓట్లు దూరం కానున్నాయి. కాగా టీబీజీకేఎస్ తీసుకున్న నిర్ణయంతో గులాబీ నేతల్లో టెన్షన్ మొదలైంది.

Also Read : PM Narendra Modi: ‘సందేశ్‌ఖాలీ’ అభ్యర్థికి మోదీ ఫోన్‌ ! ‘శక్తి స్వరూపం’ అంటూ ప్రశంస !

Leave A Reply

Your Email Id will not be published!