సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి : ఖ‌ర్గే

ఈవీఎం విధానం వ‌ద్దు బ్యాలెట్ విధానం ముద్దు

న్యూఢిల్లీ : ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బేష‌ర‌తుగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్ త‌ప్పుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఇక నుంచి ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ ప‌ద్ద‌తి ద్వారా ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని కోరారు. లేక‌పోతే ఈ దేశంలో బీజేపీనే కంటిన్యూగా అధికారంలో ఉంటుంద‌న్నారు. ఇప్ప‌టికైనా త‌న త‌ప్పు తెలుసుకోవాల‌ని లేక పోతే జ‌నం నుంచి ఆగ్ర‌హం వ్య‌క్తంకాక త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. ఇంత నిస్సిగ్గుగా కేంద్రం వ్య‌వ‌హ‌రించ‌డం బాధాక‌ర‌మ‌ని పేర్కొన్నారు ఖ‌ర్గే. న్యూఢిల్లీలో బుధవారం జ‌రిగిన ఇండియా కూట‌మి స‌మావేశంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికతో ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలో ఐక్యతను నొక్కిచెప్పారు. భవిష్యత్తు ఎన్నికల్లో స‌ర్-పూర్వపు ఓటర్ల జాబితాలను వాడాలని , ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరగాలని ఖర్గే గట్టిగా వాదించారు.

ఓటర్ల జాబితాల వ్యవహారంలో జోక్యం చేసుకుంటున్న శక్తులకు వ్యతిరేకంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసి ‘అప్రూవర్’గా (సాక్షిగా) మారాలని ఖర్గే అన్నారు. CEC వ్యవహారశైలి పూర్తిగా బయట పడిందని కాంగ్రెస్ అధినేత పేర్కొన్నారు. ఆయనతో పాటు ఉన్న ఇతర ఇద్దరు సభ్యులు 10 నెలల వ్యవధిలో 14 సార్లు లేఖలు రాశారని, ఇది ఆయన నిజాయితీని, ఉద్దేశాలను ప్రశ్నార్థకం చేస్తోంద‌న్నారు. కాబట్టి, ఆయన్ని పదవి నుంచి తొలగించాలన్నారు. ఆయనలో ఏమాత్రం రాజ్యాంగపరమైన లేదా నైతిక బాధ్యత ఉన్నా, స్వయంగా రాజీనామా చేసి, మన ఓటర్ల జాబితాలలో జోక్యం చేసుకుంటున్న శక్తులకు వ్యతిరేకంగా సాక్షిగా మారాలి అని ఖర్గే అన్నారు. పారదర్శకత స్థానంలో రహస్య విధానం రావడాన్ని ప్రతిపక్ష కూటమి అంగీకరించదని ఆయన స్పష్టం చేశారు. మన గణతంత్ర వ్యవస్థకు మూల సూత్రమైన ‘ఒక వ్యక్తి – ఒక ఓటు – ఒక విలువ’ అనే విధానం బలహీన పడటానికి తాము ఎట్టి ప‌రిస్థితుల్లో అనుమ‌తించే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!