చెన్నై : ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ , సన్ రైజర్స్ జట్టు యజమాని కావ్య మారన్ లు గ్రీస్ వేదికగా పెళ్లి చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి కేవలం కుటుంబీకులు, కొందరు సెలబ్రిటీలు మాత్రమే హాజరయ్యారు. తాజాగా అనిరుధ్ , కావ్య మారన్ ల రిసెప్షన్ కార్యక్రమం శనివారం రాజధాని చెన్నైలో గ్రాండ్ గా కొనసాగనుంది. దేశ, విదేశాలకు చెందిన కొందరి ప్రముఖులను మాత్రమే ఆహ్వానం పలికారు. తాజాగా అందిన సమాచారం మేరకు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు, అధినేతలు, ముఖ్యమంత్రులు, సినీ, క్రీడా రంగానికి చెందిన హీరోలు, హీరోయిన్లు, క్రీడాకారులు, క్రికెటర్లు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు.
తాజాగా అందిన సమాచారం మేరకు ప్రముఖ దిగ్గజ ఆటగాడు ఎం.ఎస్. ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, డేల్ స్టెయిన్, సచిన్ టెండూల్కర్, ప్యాట్ కమిన్స్, డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ తో పాటు మరికొందరు ప్రముఖ క్రికెటర్లు హాజరు కానున్నారు. వీరితో పాటు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారనున్నారు. వీరిలో షారుఖ్ ఖాన్, అనుష్క శర్మ, సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్, కియారా అద్వానీ, హృతిక్ రోషన్, సారా అలీ ఖాన్, రష్మిక మందన్న ఉన్నారు. కాగా వీరిలో ఎవరెవరు ఖచ్చితంగా ఈ రిసెప్షన్‌కు హాజరవుతారనేది ఇంకా స్పష్టత లేదు.
దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ ఇప్పటికే చెన్నైకి చేరుకున్నారు.
