Covid19 Booster Dose : కేంద్ర ప్రభుత్వం బూస్టర్ డోస్ ఉచితం
75 రోజుల పాటు దేశమంతటా డ్రైవ్
Covid19 Booster Dose : కరోనా మహమ్మారి ఇంకా తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడో ఒక చోట కరోనా కలకలం రేపుతూనే ఉంది. కొన్ని దేశాలలో ఇప్పటికీ కఠినతరమైన నిబంధనలు అమలు చేస్తున్నారు.
అంతే కాకుండా మాస్కులు తప్పనిసరిగా వాడాలని ఆదేశించింది ఢిల్లీ హైకోర్టు. ఎవరైనా ప్రయాణికులు వాడక పోతే లేదా ధరించక పోతే వెంటనే
వారిని విమానాల నుంచి దింపేయాలంటూ ఆదేశించింది.
ఇదిలా ఉండగా ఓ వైపు వర్షాలతో కొన్ని రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయి. ఇదే సమయంలో కరోనా కేసులు కూడా కొంచెం తగ్గుముఖం పట్టినా
మరోసారి పెరుగుతూ ఆందోళనకు గురి చేస్తున్నాయి.
దీంతో కేంద్ర ప్రభుత్వం మరోసారి కరోనాపై(Covid19 Booster Dose) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో సమీక్ష చేపట్టింది. ఈ మేరకు 75 రోజుల పాటు దేశ వ్యాప్తంగా బూస్టర్ డోస్ ఇవ్వాలని ఈ మేరకు డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించారు.
ఇందుకు సంబంధించి వ్యాక్సిన్ ను ఉచితంగా అందజేయనున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. అంతే కాకుండా ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.
ఇంకా కరోనా సమసి పోలేదని అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు కేంద్రం రంగంలోకి దిగింది. దిద్దుబాటు చర్యలకు దిగింది. అమెరికాతో పాటు పలు దేశాలు బూస్టర్ డోస్ లు వేసుకోవాలని ఆదేశాలు జారీ చేశాయి.
ఈ మేరకు కేంద్రం కూడా ఓకే చెప్పింది బూస్టర్ డోస్ ఇచ్చేందుకు. 60 ఏళ్లు పైబడిన వారిలో కనీసం దేశంలో 16 కోట్ల మంది ఉంటారని కేంద్రం
అంచనా వేసింది. వీరిలో కేవలం 16 శాతం మంది మాత్రమే తీసుకున్నారని గణాంకాలలో వెల్లడైంది.
18 నుంచి 50 సంవత్సరాల వయసులో ఉన్న వారందరికీ ఉచితంగా బూస్టర్ డోస్(Covid19 Booster Dose) ఇవ్వాలని నిర్ణయించింది. ఈనెల
15 నుంచి 75 రోజు పాటు వ్యాక్సినేషన్ సెంటర్లలో వీటిని ఇస్తారు.
Also Read : అరటి పండుతో ఇన్ని ఆరోగ్య ప్రయోగానాలున్నాయా ?