Centre Warn Covd19 : కరోనా కలకలం కేంద్రం అప్రమత్తం
జన సమ్మర్ధనంలో మాస్క్ లు ధరించాలి
Centre Warn Covd19 : కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా మహమ్మారి మరోసారి తన ప్రతాపాన్ని(Centre Warn Covd19) చూపే ప్రభావం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఒకసారి నానా హంగామా సృష్టించి లక్షలాది మంది ప్రజల ప్రాణాలు హరించి వేసిన కరోనా ఇంకా కొన్ని చోట్ల కంటిన్యూగా కొనసాగుతోంది.
భారత దేశంలో గత కొంత కాలంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ అనుకోకుండా డ్రాగన్ చైనాలో కరోనా రోజు రోజకు పెరుగుతోంది. కుప్పలు తెప్పలుగా కరోనా కారణంగా చని పోయిన శరీరాలు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కరోనా వైరస్ చైనా నుంచే మొదలైందని ఆరోపణలు ఉన్నాయి.
ఈ తరుణంలో భారత ప్రభుత్వం అత్యవసరంగా సమావేశమైంది. ఈ కీలక మీటింగ్ కు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ హాజరయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. ప్రస్తుతం పార్లమెంట్ లో తీవ్రమైన చర్చకు దారి తీసింది కరోనా. ఈ తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కరోనాపై చర్చించారు.
ఈ మేరకు కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి జనం ఎక్కువగా ఉండే ప్రాంతాలలో విధిగా మాస్క్ లు ధరించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం కీలక ప్రకటన చేసింది. అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. దేశ వ్యాప్తంగా ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.
ఇక నుంచి ఎవరైనా మాస్క్ ధరించక పోతే తీవ్ర చర్యలు తీసుకుంటామని కేంద్ర సర్కార్ హెచ్చరించింది. కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read : బ్యాంకులకు రూ. 92,570 కోట్లు టోకరా