CM Revanth Reddy : ఉత్కంఠకు తెర పడింది. కథ ముగిసింది. కానీ అసలు ట్విస్ట్ లు , సస్పెన్స్ లు ప్రతి రోజూ ఎదుర్కొనేందుకు సీఎం పదవిపై ఆసీనులైన ఎనుముల రేవంత్ రెడ్డికి అర్థం అవుతుంది. యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గా ఇప్పటికే గుర్తింపు పొందినా అంచనాలకు మించిన సవాళ్లను ఎదుర్కొనేందుకు రెడీగా ఉండక తప్పదు. ఇదే సమయంలో మాస్ లీడర్ గా రాజశేఖర్ రెడ్డి తర్వాత అంతటి జనాదరణ చూరగొన్నారు. ఏ మేరకు వీటన్నిటి నుంచి గట్టెక్కుతారనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో మెజారిటీ ఆశించిన మేర రాలేదు పార్టీకి. రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎక్కడికి వెళ్లినా తమకు 80 సీట్లు పక్కాగా వస్తాయని ప్రకటిస్తూ వచ్చారు. కానీ జనం అంతగా విశ్వసించ లేదు. ఇదే సమయంలో బీఆర్ఎస్ బాస్ , మాజీ సీఎం కేసీఆర్ కు లాభం చేకూరింది బీజేపీ వల్ల. ఎంతగా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లినా కాంగ్రెస్ పార్టీకి కేవలం 64 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఏ ఛాన్స్ వచ్చినా దానిని సద్వినియోగం చేసుకునేందుకు వెనుకాడడు మాజీ సీఎం.
CM Revanth Reddy Comment
ఇది పక్కన పెడితే అడుగడుగునా ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ కంటే ఎక్కువగా తన పార్టీలోని సీనియర్ల నుంచే నిత్యం తలనొప్పులు ఎదుర్కోనున్నారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). సీఎం ఎంపిక విషయంలో చివరి దాకా ఉత్కంఠ కొనసాగుతూ వచ్చింది. చివరకు హైకమాండ్ లోని సీనియర్లు సైతం రేవంత్ రెడ్డి ఎంపిక విషయంలో తీవ్ర స్థాయిలో చర్చోప చర్చలు జరిపారు. గత్యంతరం లేక ఎన్నికైన వారిలో అత్యధిక మంది రేవంత్ రెడ్డి పేరును ప్రతిపాదించడంతో డీకే మంత్రాంగంతో ఎట్టకేలకు రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఇదంతా పక్కన పెడితే తమ శాఖల కంటే తన కీలకమైన సీఎం పోస్టు పైనే కళ్లుంటాయి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబులకు. వీరితోనే కాదు పార్టీ పరంగా హైకమాండ్ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వుంటుంది. రేవంత్ రెడ్డి స్వయంగా నిర్ణయం తీసుకునేందుకు వీలుండదు.
ఒకవేళ ఉన్నా అందుకు సీనియర్ పెద్దలు ఒప్పుకోరు. ఇక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయాలంటే సమర్థవంతమైన ఉన్నతాధికారులతో పాటు ప్రజలు కూడా కొంత మేరకు సహకారం అందించాల్సి ఉంటుంది. కొంత సమయం కూడా పడుతుంది. తనకంటూ ఓ నమ్మకమైన పని చేసే బృందాన్ని ఎంపిక చేసుకోవడంపై ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. ఇక తెలంగాణలో 10 ఏళ్ల పాటు పాలన సాగించిన కేసీఆర్ వ్యవస్థలను నిర్వీర్యం చేశాడు. అడుగడుగునా తన పరివారాన్ని నింపాడు. ఎక్కడో ఒక చోట దొరకక పోతాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు కేసీఆర్ . సీఎంగా ప్రస్తుతానికి సంతోషానికి లోనవుతున్నా రోజు రోజు, రాను రాను మరింత తలనొప్పులను రేవంత్ రెడ్డి ఎదుర్కోక తప్పదు. సుదీర్ఘ కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. మరి ఏ మేరకు సక్సెస్ అవుతాడనేది చూడాలంటే కొంత కాలం పాటు ఆగాలి.
Also Read : CM Revanth Reddy : సీఎంగా కొలువు తీరిన రేవంత్ రెడ్డి