Revanth Reddy : ప్రైవేట్ యూనివ‌ర్శిటీల నివేదిక ఇవ్వండి

ఆదేశించిన సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి

Revanth Reddy : హైద‌రాబాద్ – సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy). రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతులు, మార్గదర్శకాలు, ప్రభుత్వం నుంచి పొందుతున్న సౌకర్యాలు, విద్యార్థుల సంఖ్య, వసూలు చేసిన ఫీజులు, ఫీజు రీయింబర్సుమెంటు, టీచింగ్ సిబ్బంది, నాన్ టీచింగ్ సిబ్బంది వంటి వాటి అన్నింటి పైనా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మౌలికవసతులు, అర్హతలున్న సిబ్బంది లేకుండా ప్రమాణాలతో కూడిన విద్యను ప్రైవేటు యూనివర్సిటీలు ఎలా అందిస్తున్నాయో స్ప‌ష్టం చేయాల‌ని పేర్కొన్నారు.

Revanth Reddy Comment

ఇండ్ల ప్లాట్లకు రిజిష్ట్రేషను అయిన భూములను, ధరణిలో చూపించిన ప్రైవేటు యూనివర్సిటీకి అనుమతిని ఇచ్చారని, అలాంటి వాటిలో ఎలాంటి విద్యను అందిస్తున్నాయనే నివేదికను ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

ఇండ్ల స్థలాల కింద రిజిష్టరు అయిన, వివాదంలో ఉన్న భూముల్లో యూనివర్సిటీలకు అనుమతులు ఇవ్వడం వల్ల ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వీటిపై సమగ్ర నివేదికను ఇవ్వాలని ఆదేశించారు. యూనివర్సిటీకి అనుమతులు రాకుండానే అడ్మిషన్లు నిర్వహించిన ఒక కాలేజీ వ్యవహారం వల్ల గత విద్యా సంవత్సరంలో చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు పడిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు.

సర్వ శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) నిధులతో మన ఊరు-మన బడి కింద ఖర్చు చేసిన నిధులకు సంబధించి సమగ్రంగా విచారణ జరపాలని అన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమం కింద ఇప్పటిదాకా జరిగిన నిధుల వినియోగం పైనా సమగ్రంగా విచారణ జ‌ర‌పాల‌న్నారు.

Also Read : Salaar Movie : స‌లార్ సినిమా క‌లెక్ష‌న్ల సునామీ

Leave A Reply

Your Email Id will not be published!