‘వీబీ-జీ రామ్ జీ’తో ప‌ల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పన

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్ర‌క‌ట‌న

శ్రీసత్యసాయి జిల్లా : వీబీ-జీ రామ్ జీ పథకం ద్వారా ప్రతి పంచాయతీకి రూ.2 కోట్లు వెచ్చించనున్నామని ప్ర‌క‌టించారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. ,ఈ నిధులతో ఆయా పంచాయతీల్లో రోడ్డు, ఇతర మౌలిక సదుపాయలు కల్పించనున్నామని తెలిపారు. పెనుకొండ నియోజక వర్గంలో రూ.6.45 కోట్లతో దేవాలయాల మరమ్మతులు, నూతన దేవాలయాల నిర్మాణాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. రూ.8 కోట్లతో టీటీడీ నిధులతో పెనుకొండలో కల్యాణ మండపం నిర్మాణంతో పాటు నియోజక వర్గంలో 12 భజన మండళ్లు, దేవాలయాలకు మైక్ సెట్లు, ఇతర సౌకర్యాలు కల్పిస్తామ‌ని చెప్ఆరు. గోరంట్ల మండలం వానవోలు గ్రామంలో రూ.కోటీ 97 లక్షలతో శ్రీ రంగనాథ స్వామి దేవాలయం నిర్మాణానికి మంత్రి సవిత భూమి పూజ చేశారు.

అనంతరం అదేవిధంగా గ్రామంలో రూ. 70 లక్షలతో పూర్తి చేసిన ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ నియోజక వర్గంలో దేవాలయాల మరమ్మతులు, నూతన దేవాలయాల నిర్మాణానికి దేవాదాయ శాఖ, టీటీడీ పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశాయన్నారు. సీజేఎఫ్ నిధుల ద్వారా రూ.1.97 కోట్లతో శ్రీ రంగనాథ స్వామి దేవాలయం నిర్మిస్తున్నామన్నారు. పెనుకొండ నియోజక వర్గంలో రూ.6.45 కోట్లతో పలు దేవాలయాలకు మరమ్మతులు చేయడంతో పాటు నూతన దేవాలయాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. టీటీడీ రూ.8 కోట్లు కేటాయించిందని, ఈ నిధుల్లో రూ.5 కోట్లతో పెనుకొండలో కల్యాణ మండపం నిర్మిస్తున్నామని తెలిపారు. మరో రూ.3 కోట్లతో 12 భజన మండళ్లు, దేవాలయాలకు మైక్ సెట్లు, ఇతర సౌకర్యాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. నిధులు మంజూరు చేసినందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి మంత్రి సవిత ధన్యవాదాలు తెలియజేశారు.

Leave A Reply

Your Email Id will not be published!