CS Ramakrishna Rao: సీఎస్ పదవీకాలం మరో 3 నెలలు పొడిగింపు ?
సీఎస్ పదవీకాలం మరో 3 నెలలు పొడిగింపు ?
CS Ramakrishna Rao : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు పదవీకాలం మరో 3 నెలలు పొడిగించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసినట్టు అధికార వర్గాల సమాచారం. ఏప్రిల్ 30న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణారావు ఈనెల 31న పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే ఆయన పదవీకాలం పొడిగించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించడంతో మరో మూడు నెలలు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగే అవకాశం ఏర్పడింది.
రామకృష్ణారావు (CS Ramakrishna Rao) పదవీ విరమణ చేస్తే ఆయన స్థానంలో సీఎస్‌గా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జయేశ్‌రంజన్, వికాస్‌రాజ్ పోటీలో ఉన్నా రు. కేంద్ర సరీ్వసులో ఉన్న సంజయ్ జాజు రాష్ట్రానికి రావడానికి సిద్ధంగా లేరని సమాచారం. అలాగే ఢిల్లీలో తెలంగాణ భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశాంక్ గోయల్‌కు సీఎస్‌గా అవకాశం లేదని సమాచారం.
CS Ramakrishna Rao – నేషనల్ వాస్క్యులర్ డే సందర్భంగా వాక్‌థాన్ !
నేషనల్ వాస్క్యులర్ డే సందర్భంగా బేగంటపేటలోని కిమ్స్-సన్ షైన్ ఆసుపత్రుల ఆధ్వర్యంలో వాక్‌థాన్ నిర్వహించారు. ‘వాక్ ఏ మైల్ టు లివ్ విత్ ఏ స్మైల్’ పేరుతో సంజీవయ్య పార్క్ నుంచి ప్రారంభమైన వాక్‌థాన్‌ను నటుడు రాజీవ్ కనకాల జెండా ఊపీ ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో యువతి, యువకులు, వైద్య విద్యార్థులు, వైద్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ… భారతదేశంలో వాస్క్యులర్ సమస్యల వల్ల ఏటా సుమారు 25,000 మంది చేతులు, కాళ్లు కోల్పోతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా మధుమేహం ఉన్న రోగులలో ఇది అధికంగా కనిపిస్తుందని, త్వరగా గుర్తించి వైద్యం తీసుకుంటే 80శాతం వరకు నివారించవచ్చని తెలిపారు.
Also Read : Supreme Court: స్థానికత నిబంధనను 2028 నుంచి అమలు చేయండి – తెలంగాణకు సుప్రీం సూచన
