సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న ‘దాదా ధ‌మాకా’

పాట‌తో దుమ్ము రేపిన బాల‌య్య‌, న‌ర్గీస్ ఫ‌క్రీ

హైద‌రాబాద్ : టాలీవుడ్ లో ద‌మ్మున్న ద‌ర్శ‌కుడిగా పేరు పొందాడు గోపీచంద్ మ‌లినేని. త‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రంలో నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి దాదా ధ‌మాకా పేరుతో గ్లింప్స్ సాంగ్ విడుద‌ల చేశారు. ఇది ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. ట్రెండింగ్ లో కొన‌సాగుతోంది. ఇందులో బాల‌య్య‌తో పాటు బాలీవుడ్ కు చెందిన ప్ర‌ముక న‌టి న‌ర్గీస్ ఫ్ర‌కీ కూడా పోటీ ప‌డి న‌టించింది. ఈ పాట‌కు అద్భుతంగా సంగీతం అందించాడు ఎస్ఎస్ థ‌మ‌న్. ఈ పాట‌ను రామ జోగ‌య్య శాస్త్రి రాశారు. విచిత్రం ఏమిటంటే ఈ పాట‌ను ర‌జ‌నీ శ్రీ పూర్ణిమ‌తో పాటు నంద‌మూరి బాల‌య్య పాడారు. ఈ సినిమాను వ‌చ్చే డిసెంబ‌ర్ 24న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు మూవీ మేక‌ర్స్.

ఈ రాబోయే దాదా మూవీలో నంద‌మూరి బాల‌య్య బాబుతో పాటు మంచు మనోజ్, కాజల్ అగర్వాల్, సముద్రఖ‌ని, శరత్ కుమార్, అభిమన్యు సింగ్, ఉపేంద్ర లిమాయే, మనీష్ వాధ్వా, స్వాసిక న‌టించారు. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా ఈ సినిమాను వెంక‌ట స‌తీష్ కిలారు నిర్మించారు. ఎం వివేక్ ఆనంద్, నిమ్మగడ్డ శ్రీకాంత్, శ్రీనివాస్ గవిరెడ్డి, మయూఖ్ ఆదిత్య, కృష్ణ హరి ఈ సినిమాకు ర‌చ‌యిత‌లుగా ప‌ని చేస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లు విజ‌య‌వంత‌మైన సినిమాల‌లో న‌టించారు బాల‌కృష్ణ‌. ఈ సినిమాలో కూడా ఆయ‌న వేసిన స్టెప్పులు త‌న అభిమానుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఎక్క‌డ చూసినా దాదా ధ‌మాకా పాట క‌నిపోస్తోంది. ఇదిలా ఉండ‌గా నవంబ‌ర్ 16న ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న ఎస్ఎస్ థ‌మ‌న్ పుట్టిన రోజు. ఇవాల్టితో ఆయ‌న 43 ఏళ్ల‌లోకి అడుగు పెడుతున్నారు.

Leave A Reply

Your Email Id will not be published!