భారత్ – న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
అక్టోబర్ 20 నుంచి అమలులోకి రానుందన్న కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ : భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అక్టోబర్ 20న అమల్లోకి రానుంది. వివిధ దేశాలతో ద్వైపాక్షిక వాణిజ్యం , పెట్టుబడులను పెంచడానికి, అలాగే దేశ ఎగుమతులను వృద్ధి చేయడానికి భారత్ వేగంగా అడుగులు వేస్తున్న తరుణంలో మంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. న్యూజిలాండ్‌తో బలమైన, మరింత ప్రతిష్టాత్మకమైన ఆర్థిక భాగస్వామ్యాన్ని నిర్మించాలనే మా ఉమ్మడి నిబద్ధతకు అద్దం పడుతూ, ఆ దేశంతో మా ద్వైపాక్షిక ఆర్థిక భాగస్వామ్యంలో తదుపరి కీలక మైలురాయిని తాము ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు. ఈ ఒప్పందం 2026 అక్టోబర్ 20న దసరా పర్వదినాన అమల్లోకి రానుంది అని గోయల్ పేర్కొన్నారు. అదే సమయంలో భారత్ , కెనడా మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కోసం తదుపరి విడత చర్చలు అక్టోబర్ 5 నుండి జరగనున్నాయని తెలిపారు. వివిధ దేశాలతో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను పెంచడానికి, అలాగే దేశ ఎగుమతులను వృద్ధి చేయడానికి భారత్ వేగంగా అడుగులు వేస్తున్న తరుణంలో మంత్రి ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
భారత్-న్యూజిలాండ్ ఒప్పందం ద్వారా, రాబోయే 15 ఏళ్లలో న్యూజిలాండ్ నుండి భారత్‌కు 20 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది అని గోయల్ ఇక్కడ విలేకరులతో అన్నారు. ఏప్రిల్ 27న కుదిరిన భారత్-న్యూజిలాండ్ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటి నుండే న్యూజిలాండ్‌కు జరిగే భారతీయ ఎగుమతులన్నింటికీ (100 శాతం) సుంకం లేని ప్రవేశాన్ని కల్పిస్తుందన్నారు. న్యూజిలాండ్‌తో బలమైన , మరింత ప్రతిష్టాత్మకమైన ఆర్థిక భాగస్వామ్యాన్ని నిర్మించాలనే మా ఉమ్మడి నిబద్ధతకు అద్దం పడుతుందన్నారు గోయల్. ఆ దేశంతో మా ద్వైపాక్షిక ఆర్థిక భాగస్వామ్యంలో తదుపరి కీలక మైలురాయిని తాము ముందుకు తీసుకు వెళ్లేందుకు శాయశక్తులా ప్రయత్నం చేస్తూనే ఉంటామన్నారు. భవిష్యత్తులో, ఈ ఒప్పందంలోని నిబంధనలు భారతదేశం , న్యూజిలాండ్ వ్యాపారాలకు, ప్రజలకు తక్షణమే స్పష్టమైన ప్రయోజనాలుగా మారేలా చూడటమే మన తక్షణ ప్రాధాన్యతగా ఉండాలన్నారు పీయూష్ గోయల్.
