హైదరాబాద్ : ఈ ఏడాదిలో అత్యంత తక్కువ బడ్జెట్ తో తీసిన మూవీ హనుమాన్ అంశ్. కానీ ఎవరూ ఊహించని విధంగా కోట్ల వర్షం కురిపిసింది. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నీమ్ కరోలి బాబా నిజ జీవితం ఆధారంగా దీనిని తీశారు. రికార్డులను తిరగ రాసింది ఈ చిత్రం. వాస్తవికతను ఆవిష్కరించింది. దీంతో ప్రేక్షకులు ఈ సినిమాకు కనెక్ట్ అయ్యారు. దీంతో పలు భాషలలో ఇది విడుదలకు సిద్దమైంది. ఇక సినిమా విషయానికి వస్తే హనుమాన్ అంశ్ తెలుగు వెర్షన్ లో అక్టోబర్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ట్రైలర్ నీమ్ కరోలీ బాబా జీవిత విశేషాలను ఆవిష్కరిస్తోంది. ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవితం ఆధారంగా రూపొందిన ‘హనుమాన్ అంశ్’ చిత్రంలో షోబినవ్ సత్య ప్రధాన పాత్ర పోషించారు. హోంబలే ఫిల్మ్స్ పంపిణీలో ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. హిందీలో విజయవంతమైన ప్రదర్శన తర్వాత ఈ సినిమా తెలుగులో భారీ అంచనాల మధ్య విడుదలవుతోంది.
డాక్టర్ విశాల్ చతుర్వేది రచన , దర్శకత్వంలో ఈ బయోపిక్ రూపొందింది. ఇందులో షోబినవ్ సత్య, భక్తులచే ‘మహారాజ్-జీ’ అని ప్రేమగా పిలవబడే నీమ్ కరోలీ బాబా పాత్రలో కనిపించనున్నారు. చందన్ ఆనంద్ , పూర్ణిమ తివారీ ఈ ఆధ్యాత్మిక చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఇటీవల విడుదలైన ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్, నీమ్ కరోలీ బాబా జీవితాన్ని పరిచయం చేయడంతో పాటు, విశ్వాసం , నమ్మకం ప్రధాన ఇతివృత్తంగా సాగే ఈ సినిమా తీరును తెలియజేస్తోంది. గురువుతో కలిసి ఆధ్యాత్మిక ప్రయాణం చేసే అనుభూతిని ప్రేక్షకులకు అందించడం ఈ చిత్రం లక్ష్యం అని ప్రకటించారు మూవీ మమేకర్స్. అలాగే, ప్రపంచవ్యాప్తంగా ఆయన అందించిన సందేశాన్ని వివిధ భాషల కోణంలో ఇది ఆవిష్కరిస్తుంది. శ్రేయస్ ధర్మాధికారి , రిషి పాఠక్ ఈ చిత్రానికి హృదయానికి హత్తుకునే సంగీతాన్ని అందించారు.
హిందీలో విజయవంతమైన ప్రదర్శన తర్వాత, దక్షిణ భారత భాషలలో ‘హనుమాన్ అంశ్’ థియేటర్ పంపిణీ హక్కులను హోంబలే ఫిల్మ్స్ దక్కించుకుంది. ఈ చిత్రం పలు దక్షిణ భారత భాషలలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.
