విక‌సిత్ భార‌త్ నా ల‌క్ష్యం : న‌రేంద్ర మోదీ

జాతిని ఉద్దేశించి కీల‌క వ్యాఖ్య‌లు చేసిన పీఎం

న్యూఢిల్లీ : దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. విక‌సిత్ భార‌త్ త‌న ల‌క్ష్య‌మ‌ని అని అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు, ఒక లక్ష్యం కోసమే నా జీవనం సాగిస్తున్న‌ట్లు చెప్పారు. త‌న‌పై కొంద‌రు కావాల‌ల‌ని దుష్ప్ర‌చారం చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆవేద‌న చెందారు. బుధ‌వారం జ‌రిగిన ‘వికసిత్ భారత్ సంకల్ప సభ’లో ప్రసంగించారు ప్ర‌ధాన‌మంత్రి. ఈ రోజు కేవలం జ్ఞాపకాలను నెమరు వేసుకునే రోజు మాత్రమే కాదన్నారు. మన సంకల్పాలకు కొత్త ఉత్సాహాన్ని నింపుకునే రోజుగా ఆయ‌న అభివ‌ర్ణించారు. మనం దీన్ని సాధిస్తాం; దేశం కోసం జీవిస్తాం. దేశం కోసం ప్రాణాలర్పిస్తాం. దేశానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడమే మన లక్ష్యం అని ప్ర‌క‌టించారు మోదీ. అన్ని సవాళ్లను అధిగమించి 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ది చెందిన దేశంగా మారుస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. నేను వ్యక్తిగత ఆశయాలు లేదా స్వప్రయోజనాల కోసం జీవించే వ్యక్తిని కాదన్నారు.

ఒక లక్ష్యం కోసమే జీవిస్తున్నానని తెలిపారు మోదీ. త‌న జీవిత ప్ర‌యాణంలో ఎన్నికల రాజకీయాల్లో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో జరిగిన భారీ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బరాక్ ఒబామా తన ఎన్నికల ప్రసంగంలో అవును, మనం దీన్ని చేయగలం అని అన్నట్లుగానే మోదీ కూడా ఒలింపిక్స్ నిర్వహణ, భారత్‌ను క్వాంటం , ఏఐ హ‌బ్ గా మార్చ‌డం , భారతీయులను అంతరిక్షంలోకి పంపడం, స్వయం సమృద్ధ భారత్, ప్రపంచ తయారీ కేంద్రంగా (గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్) తీర్చిదిద్దడం వంటి వివిధ లక్ష్యాలను ప్రస్తావించారు. ఎన్ని అవాంత‌రాలు ఎదురైనా స‌రే మ‌నం వీటిని సాదించి తీరుతామ‌ని ప్ర‌క‌టించారు న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ.

Leave A Reply

Your Email Id will not be published!